HomeTelugu Trendingమార్ఫింగ్‌ ఫొటోతో వర్మ కామెంట్స్.. వైరల్

మార్ఫింగ్‌ ఫొటోతో వర్మ కామెంట్స్.. వైరల్

9 15ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తన దాడిని కొనసాగిస్తునే ఉన్నాడు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాను ప్రకటించిన దగ్గర నుంచి తనపై విమర్శలు గుప్పిస్తున్న వారిపై తనదైన స్టైల్‌లో కౌంటర్‌ ఇస్తున్నాడు. ఇప్పటికే లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌కు సంబంధించి పాటలతో వివాదాలకు తెర తీసిన వర్మ సోషల్‌ మీడియా పోస్ట్‌లతో మరింత వేడి పెంచుతున్నాడు. తాజాగా బాహుబలి సినిమాకు సంబంధించిన ఓ ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వర్మ ఆసక్తికర కామెంట్ చేశాడు.

బాహుబలి 2 టైటిల్స్‌ సమయంలో వచ్చిన బాహుబలిని కట్టప్ప వెన్నుపోటు పొడుస్తున్న ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. ఫొటోషాప్‌లో గ్రాఫిక్స్‌ చేసిన ఇమేజ్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వర్మ.. ‘ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తులు నాకు సరిగా గుర్తు రావటం లేదు.. వీరిని గుర్తుపట్టడంలో నాకు సాయం చేయండి’ అంటూ కామెంట్ చేశాడు. వర్మ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న మూవీ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్’ ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ఈసినిమాలో కీలక పాత్రల్లో యాగ్న శెట్టి, శ్రీతేజ్‌లతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రంగస్థల కళాకారుడు కీలక పాత్రల్లో నటించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!