ఆస్కార్‌పై రామ్‌చరణ్‌- ఎన్టీఆర్‌ స్పందన


‘ఆర్ఆర్ఆర్’ చిత్రం భారతీయ సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచం నలుదిశలా చాటింది. ‘నాటునాటు’ పాట ఆస్కార్ అవార్డును సాధించడంతో ఈ సినిమా పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతోంది. ఈ క్రమంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌లు స్పందించారు.

ఎన్టీఆర్ స్పందిస్తూ‌.. ఆస్కార్ రావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. నాటునాటు పాటకు అవార్డు రావడం ఎమోషనల్ మూమెంట్ అని అన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఇండియాకు ప్రాతినిథ్యం వహించిందని చెప్పారు. ‘కంగ్రాచ్యులేషన్స్ కీరవాణి సర్ జీ, జక్కన్న , చంద్రబోస్ గారు’ అని ట్వీట్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా టీమ్ కు అభినందనలు తెలియజేశారు.

రామ్ చరణ్ స్పందిస్తూ… ఇప్పటికీ తనకు కలలో ఉన్నట్టుగానే ఉందని చెప్పారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ సినిమా ఎప్పటికీ నిలిచి పోతుందని అన్నారు. తమ జీవితాల్లో ఈ సినిమా చాలా ప్రత్యేకమైనదని చెప్పారు. రాజమౌళి, కీరవాణి ఇద్దరూ భారతీయ సినీ పరిశ్రమలో రెండు అత్యంత విలువైన రత్నాలని కొనియాడారు.

మాస్టర్ పీస్ లాంటి ఈ చిత్రంలో తనకు అవకాశం ఇచ్చినందుకు వీరిద్దరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా నాటునాటుకు సంబంధించిన ఎమోషన్ ఉందని రామ్ చరణ్ అన్నారు. చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, ప్రేమ్ రక్షిత్ అందరూ కలిసి ఈ ఎమోషన్ ను క్రియేట్ చేశారని కితాబిచ్చారు.

సోదరుడు తారక్ తో కలిసి మళ్లీ డ్యాన్స్ చేయాలని, మళ్లీ రికార్డులు సృష్టించాలని కోరుకుంటున్నానని చెప్పారు. తన కోస్టార్ అలియా భట్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఈ ఆస్కార్ అవార్డు ప్రతి ఇండియన్ యాక్టర్ కు, టెక్నీషియన్ కు, సినీ అభిమానికి చెందుతుందని చెప్పారు. ‘మనం గెలిచాం. ఒక భారతీయ చిత్ర పరిశ్రమగా మనం గెలిచాం. ఒక దేశంగా మనం గెలిచాం. మన ఇంటికి ఆస్కార్ వస్తోంది’ అని ట్వీట్ చేశారు.

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates