చిరు కోసం రానా, నవదీప్!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘ఖైదీ న్ంబర్ 150’ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం నిజానికి ఈ నెల 25న జరగాలి కానీ కొన్ని కారణాల వలన ఆడియో ఫంక్షన్ ను క్యాన్సిల్ చేసి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమం విజయవాడలోని జనవరి 4న గ్రాండ్ గా నిర్వహించనున్నారు. అయితే నిన్న విడుదలయిన శాతకర్ణి ఆడియో ఫంక్షన్ ను దృష్టిలో పెట్టుకొని దాన్ని మించి ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

ముందుగా ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా నవదీప్, రానాలను ఎన్నుకున్నారు. ఈ ఇద్దరు కలిసి ఈ షోకి మరింత గ్లామర్ ను తీసుకురావడానికి రెడీ అవుతున్నారు. అంతేకాదు ఈ కార్యక్రమంలో దేవిశ్రీప్రసాద్ లైవ్ పెర్ఫార్మన్స్ తో పాటు మెగా ఫ్యామిలీ హీరోల పెర్ఫార్మన్స్ లు కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ ను కూడా ఈ వేడుకకు ఆహ్వానించనున్నారు కానీ ఆయన వచ్చే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు.