HomeTelugu Big Storiesతాప్సిపై విరుచుకుపడిన కంగనా సోదరి

తాప్సిపై విరుచుకుపడిన కంగనా సోదరి

13 4బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ సోదరి రంగోలీ ట్విటర్‌ రచ్చ మళ్లీ మొదలైంది. కొంతకాలంగా రంగోలీ.. నటి తాప్సిపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై తాప్సి ఇటీవల స్పందిస్తూ.. ‘నేను నటించిన ‘మిషన్‌ మంగళ్‌’ సినిమాలో ఐదుగురు మహిళలు ఉన్నారు. మరి కంగన వారిలో ఒక్కరినీ ఎందుకు మెచ్చుకోలేదు?’ అని చురకలంటించారు. ఇందుకు రంగోలీ ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

‘ఈ మేడమ్‌ (తాప్సిని ఉద్దేశిస్తూ) రోజూ కంగనను ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. అసలు నువ్వేం చేశావని నిన్ను మెచ్చుకోవాలి తాప్సి? అక్షయ్‌ కుమార్‌, విద్యాబాలన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాలో కేవలం రెండు నిమిషాల నిడివి ఉన్న పాత్రలో నటించడమా? లేక అమితాబ్‌ బచ్చన్‌ సినిమాల్లో ఒకే రకమైన ఎక్స్‌ప్రెషన్‌ ఇస్తూ చిన్న చిన్న పాత్రలు చేయడమా? ఏమని మెచ్చుకోమంటావ్‌? ఓ గొప్ప నటిపై (కంగన) కామెంట్లు చేస్తున్నావ్‌. నువ్వేం చిన్న పిల్లవి కాదు. నీది కూడా నా సోదరి వయసే. అసలు నీ కెరీర్‌లో ఏం సాధించావని నిన్ను మెచ్చుకోవాలి. ఒకసారి నువ్వు ఇచ్చిన ఇంటర్వ్యూలు చూసుకో. కేవలం కంగన గురించి మాట్లాడటానికి మాత్రమే విలేకర్లు నీ వద్దకు వస్తారు. అంతే కానీ నీ సినిమాల గురించి నువ్వు సాధించిన వాటి గురించి ఎవ్వరూ ఒక్క ప్రశ్న కూడా అడగరు. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి మళ్లీ మీడియా ముందుకు వెళ్లకు. నాకు ట్విటర్‌లో నేరుగా సమాధానం చెప్పు’ అంటూ మరోసారి తాప్సిపై విరుచుకుపడింది రంగోలీ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!