శర్వానంద్ ‘రణరంగం’ టీజర్‌ రెడీ

యంగ్‌ హీరో శర్వానంద్ నటించిన తాజా చిత్రం ‘రణరంగం’. ఈ చిత్రంలో శర్వా గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని సుధీర్ వర్మ డైరెక్ట్ చేశారు. మొదటి నుండి ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఉండటంతో ప్రేక్షకులు టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ కూడా టీజర్ సిద్ధం చేసింది. వచ్చే వారంలో ఈ టీజర్ ట్రీట్ ఉండనుంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ప్రధాన హీరోగా నటించగా కళ్యాణి ప్రియదర్శన్ ఒక కీలక పాత్రలో కనిపించనుంది. ఆగష్టు 2వ తేదీ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.