రష్మిక తమిళ ఎంట్రీ.. హీరో ఎవరో తెలుసా!!

ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన.. గీత గోవిందం లాంటి సూపర్‌ హిట్‌ సినిమాతో టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది రష్మిక మందాన్న. ఇక ఈ చిత్రాల విజయంతో రష్మిక.. ఫుల్‌ స్పీడ్‌లో దూసుకపోతున్నారు. రష్మిక ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో డియర్‌ కామ్రేడ్‌, నితిన్‌తో భీష్మ చేస్తూ బిజీగా ఉన్నారు.

అయితే ఈ భామ కోలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా సోషల్‌ మీడియాలో తన అభిమానులు కూడా ఇదే విషయం ప్రశ్నలు అడగ్గా.. తనకు కూడా కోలీవుడ్‌లో సినిమాలు చేయాలని ఉందనే కోరికను వెల్లిబుచ్చారు. అయితే ప్రస్తుతం ఆ దిశగానే అడుగులు పడుతున్నట్లు సమాచారం. యంగ్‌ హీరో కార్తీ సరసన రష్మిక నటించబోతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. కార్తీ తాజాగా ‘దేవ్‌’ తో ప్రేక్షకులను పలకరించాడు.