
RCB or PBKS Winners:
ఈరోజు IPL ఫైనల్ అంటే రగడే రగడ! అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు RCB మరియు PBKS టీమ్స్ తలపడుతున్నాయి. ఇద్దరూ ఇప్పటివరకు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేకపోయిన టీమ్స్. కానీ ఈరోజు, వారి కలలు నెరవేరబోతున్నాయి.
RCB మూడు సార్లు ఫైనల్‌కు వచ్చి చేతులేర్చింది (2009, 2011, 2016). ఇక PBKS 2014లో కాస్త దూరంగా నిలిచింది. కానీ ఈసారి మాత్రం ఒక్కటే ఉద్దేశ్యం – టైటిల్ గెలవాలి!
ఎంత బహుమతి ఉందంటే.. ఈసారి IPL విజేతకు రూ. 20 కోట్లు క్యాష్ ప్రైజ్. రెండవ స్థానానికి రూ. 13 కోట్లు. మూడో, నాల్గవ స్థానాల్లో ఉన్న టీమ్స్‌కు రూ. 7 కోట్లు, రూ. 6.5 కోట్లు వరుసగా. మొత్తం టీమ్ రివార్డ్స్‌గానే రూ. 46.5 కోట్లు! 2008లో మొదటి సీజన్‌లో విజేతకు కేవలం రూ. 4.8 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు IPL అంటే ఓ భారీ ఇండస్ట్రీగా మారిపోయింది!
ప్లేయర్లకు ప్రత్యేక అవార్డ్స్:
Orange Cap, Purple Cap – రూ. 15 లక్షల చొప్పున
Emerging Player, MVP – రూ. 20 లక్షల చొప్పున
Most Sixes, Game Changer – రూ. 12 లక్షల చొప్పున
మాన్ ఆఫ్ ద మ్యాచ్ – ఒక్క మ్యాచ్‌కే రూ. 1 లక్ష
ఇటీవల Qualifier 2లో వర్షం ఆట పాడుచేసినట్టు – ఇదే తరహా వాతావరణం ఇప్పుడు కూడా ఉండే అవకాశం ఉంది. కానీ ఫ్యాన్స్ మాత్రం ఈమ్యాచ్ జరగాలని అతి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈరోజు గెలిచేది ఎవరో కాదు, కానీ ఇద్దరికీ ఇది మరిచిపోలేని రాత్రి అవుతుంది. టైటిల్ ఎవరైనా గెలిచినా, క్రికెట్ అభిమానులకు మాత్రం ఇది మర్చిపోలేని మ్యాచ్!