
IPL 2025 Final: War 2 Update during RCB vs PBKS
ఈరోజు IPL 2025 Final మ్యాచ్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరగబోతోంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) Vs పంజాబ్ కింగ్స్ (PBKS) మధ్య కత్తిమీద సాము జరుగబోతోంది. కానీ ఈ మ్యాచ్ ఒక్క క్రికెట్ మ్యాచ్ మాత్రమే కాదు. ఎందుకంటే… బాలీవుడ్ నుంచి ఓ పెద్ద సర్ప్రైజ్ రెడీగా ఉంది!
అదేంటంటే, హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అడ్వాణీ లు నటిస్తున్న యాక్షన్ మూవీ ‘వార్ 2’ నుంచి కొత్త 10-సెకన్ల ప్రోమో ఈ మ్యాచ్‌లో రిలీజ్ చేయబోతున్నారు. ఇది Jio Cinema, Hotstarలో మ్యాచ్ సందర్భంగా మధ్యలో ప్రసారం కానుంది. అంటే క్రికెట్ చూస్తున్నప్పుడు ఒక్కసారిగా హృతిక్ – ఎన్టీఆర్ – కియారా అందరూ మీ ముందే మెరుస్తారు!
ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్ష్ ఈ వార్తను ధృవీకరించారు. ఇది ఫుల్ ట్రైలర్‌కు ముందు చిన్న టీజర్ లాంటి స్పెషల్ ట్రీట్ అని చెప్పారు. ఇంతకు ముందు మొదటి టీజర్ మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజున రిలీజ్ అయ్యింది.
‘వార్ 2’ 2019లో వచ్చిన హిట్ మూవీ ‘వార్’ కు సీక్వెల్. అప్పట్లో హృతిక్, టైగర్ ష్రాఫ్ కలసి ఊహించని విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఆ స్థానంలో ఎన్టీఆర్ రావడం విశేషం. దర్శకుడు అయాన్ ముఖర్జీ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతుంది.
ఈ సినిమా YRF స్పై యూనివర్స్ లో భాగంగా వస్తోంది. ఐపీఎల్ ఫైనల్ వేదికగా కొత్త ప్రోమో చూపించడం చాలా స్మార్ట్ మూవ్. ఎందుకంటే ఈ మ్యాచ్‌ను కోట్ల మంది చూస్తారు. అందుకే, ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి డబుల్ ధమాకా — క్రికెట్ థ్రిల్ & వార్ 2 కిక్!