జూనియర్ పవన్ బిరుదు వద్దు!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రేణు దేశాయ్ ల కుమారుడు అఖిరా నందన్ ఈరోజు 13వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సంధర్భంగా తన కుమారుడికి సామాజిక మాధ్యమం ద్వారా శుభాకాంక్షలు చెప్పిన రేణు కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు.

”అఖిరాకు 13 ఏళ్ళు. ఆరడుగుల హైట్ తో నా కొడుకు 13వ సంవత్సరంలో అడుగుపెట్టడం నమ్మలేకపోతున్నాను. ఈ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు సంపాదించుకోవాలి. జూనియర్ పవర్ స్టార్ అనే బిరుదు కాకుండా అఖిరా నందన్ గా సొంత గుర్తింపు తెచ్చుకుంటాడనే నమ్మకం ఉంది” అంటూ తన గారాల కుమారుడికి విషెస్ ను అందించింది.