HomeTelugu Trendingబబుల్‌గమ్‌' ట్రైలర్‌ విడుదల

బబుల్‌గమ్‌’ ట్రైలర్‌ విడుదల

Roshan Kanakala Bubblegum T

యాంకర్‌ సుమ కనకాల కొడుకు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇస్తున్న తాజా చిత్రం ‘బబుల్‌గమ్‌’. రవికాంత్‌ పేరెపు డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రంలో మానస చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే లాంఛ్ చేసిన బబుల్‌గమ్‌ ప్రీ లుక్‌ పోస్టర్‌, సాంగ్స్‌, టీజర్‌కు మంచి స్పందన వస్తోంది.

ముందుగా అందించిన అప్‌డేట్ ప్రకారం బబుల్‌గమ్‌ ట్రైలర్‌ను లాంఛ్ చేశారు. నా డెస్టినీలో ఏం రాసిపెట్టిందో నాకు తెల్వదు. కానీ నచ్చినట్టు మార్చుకుంటా.. కావాల్సింది లాక్కొని తెచ్చుకుంటా.. అంటూ హీరో చెప్పే డైలాగ్స్‌ షురూ అయింది ట్రైలర్‌. ఎవడు పడితే వాడు చేతులేశాడనుకో.. చేతులు నరికేస్తానంటున్నాడు రోషన్‌. హీరోహీరోయిన్ల డిఫరెంట్‌ లవ్‌ ట్రాక్‌తో సాగుతున్న ట్రైలర్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.

ప్రేమ బబుల్‌ గమ్‌ లాంటిది.. మొదట్ల తీయగుంటది.. తర్వాత అంటుకుంటది.. షూస్‌ కింద, థియేటర్లల్ల సీట్ల కింద అంత ఈజీ కాదురరేయ్‌ పండవెట్టేస్తది.. అంటూ సాగే డైలాగ్స్‌తో సాగుతున్న బబుల్‌ గమ్‌ టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచుతోంది. బబుల్‌గమ్‌లో ప్రీ లుక్‌ పోస్టర్‌లో హీరోహీరోయిన్లు సూపర్ రొమాంటిక్ మూడ్‌లో సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ చిత్రానికి శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందిస్తున్నాడు. డిసెంబర్ 29న థియేటర్లలో ఈ సినిమా సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ-మహేశ్వరి మూవీస్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి‌.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!