ఉక్రెయిన్ లో ల్యాండ్ అయిన “ఆర్ఆర్ఆర్” మూవీ యూనిట్‌


టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లు హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఇప్పటికే రెండు పాటల మినహా షూటింగ్‌ పూర్తయింది. మిగిలిన భాగాన్ని చిత్రీకరించేందుకు ఆఖరి షెడ్యూల్‌ని ఉక్రెయిన్‌లో ప్లాన్‌ చేసింది చిత్రబృందం. ఈ మేరకు మంగళవారం ఉక్రెయిన్‌ పయనమైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీం విమాన ప్రయాణ వీడియోను షేర్‌ చేసింది. ‘‘ఆఖరి షెడ్యూల్‌ కోసం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందం ఉక్రెయిన్‌లో ల్యాండ్‌ అయింది’’ అని పేర్కొంది. పీరియాడికల్‌ డ్రామాగా భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌, కొమురం భీంగా ఎన్టీఆర్‌ నటిస్తున్నారు.

ఆలియా భట్‌, ఒలివియా మోరిస్‌ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబరు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా స్నేహితుల దినోత్సవం కానుకుగా విడుదలైన ‘దోస్తీ’ సాంగ్‌ బాగా వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.

CLICK HERE!! For the aha Latest Updates