తమిళ దర్శకుడితో బాహుబలి!

బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందిన హీరో ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం బాహుబలి2 సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న ప్రభాస్ ఇప్పటికే సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేశాడు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమా చేయాలనేది డార్లింగ్ ఆలోచన. దీంతో తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో ప్రభాస్ సినిమా చేయబోతున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అట్లీ తమిళంలో కాకుండా తెలుగులో కూడా తన సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం విజయ్ 61వ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత ప్రభాస్ తో సినిమా చేస్తాడని అంటున్నారు. ఇటీవల ప్రభాస్ కూడా ఇకపై సంవత్సరానికి రెండు సినిమాలు చేస్తానని చెప్పడం అంతేకాకుండా అట్లీ బాహుబలి2 ప్రీరిలీజ్ ఫంక్షన్ కు హాజరవ్వడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతుంది.