HomeTelugu TrendingF3లో మరో మెగా హీరో!

F3లో మరో మెగా హీరో!

Sai Dharam Tej in F3 movi
విక్టరీ వెంక‌టేష్, మెగా ప్రిన్స్‌ వ‌రుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎఫ్ 3’. 2018లో వ‌చ్చిన ఎఫ్ 2 కు సీక్వెల్ గా తెర‌కెక్కుతున్న ఎఫ్ 3 షూటింగ్ జ‌రుపుకుంటోంది. త‌మన్నా, మెహ‌రీన్ కౌర్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అయితే ఈ సారి మెగా హీరో ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో క‌నిపిస్తాడ‌ని ప్ర‌చారం న‌డుస్తోన్న విష‌యం తెలిసిందే. తాజా స‌మాచారం ప్ర‌కారం మెగా సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్ ఎఫ్ 3లో భాగం కానున్న‌ట్టు వార్తలు వినిపిస్తున్నాయి‌. అనిల్ రావిపూడి, సాయిధ‌ర‌మ్ తేజ్ కాంబినేషన్‌లో వ‌చ్చిన సుప్రీం చిత్రం బాక్సాపీస్ వ‌ద్ద మంచి టాక్ తెచ్చుకుంది.

మెగాస్టార్‌ ‘లూసిఫర్‌’ ప్రారంభం

అప్ప‌టి నుంచి అనిల్‌, సాయిధ‌ర‌మ్ తేజ్ స్నేహితులుగా మారిపోయారు. వీరిద్ద‌రి మ‌ధ్య ఉన్న అనుబంధం కార‌ణంగానే ఎఫ్ 3లో కీలక పాత్ర చేసేందుకు సాయిధ‌ర‌మ్ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న కూడా త్వ‌ర‌లోనే వెలువ‌డ‌నుంద‌ట. ఈ సారి ఫ‌న్ అండ్ ఫ్రస్టేష‌న్ తోపాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ ను కూడా బాగానే చూపించ‌నున్నాడ‌ట అనిల్ రావిపూడి. అంతేకాదు సెకండ్ పార్టులో సునీల్ పాత్ర కీల‌కంగా సాగ‌నుంద‌ని స‌మాచారం. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్‌రాజు అత్యంత భారీ బడ్జెట్ తో తెర‌కెక్కిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!