HomeTelugu Trendingహీరో విశాల్ సినిమా రిలీజ్‌పై మద్రాస్ హైకోర్టు స్టే

హీరో విశాల్ సినిమా రిలీజ్‌పై మద్రాస్ హైకోర్టు స్టే

mark antony

హీరో విశాల్‌కు తాజా చిత్రం ‘మార్క్ ఆంటోని’ సినిమా రిలీజ్‌పై మద్రాసు హైకోర్టు స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఓ ఫైనాన్స్‌ వ్యవహారానికి సంబంధించిన కేసులో మార్క్‌ ఆంటోనీ మూవీ రిలీజుపై కోర్టు స్టే విధించింది. ఇప్పటికే షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబర్ 15న విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు ఏర్పాట్లు చేసుకున్నారు. హఠాత్తుగా సినిమా విడుదలను హైకోర్టు నిలిపివేసింది.

ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు హీరో విశాల్ రూ.21.29 కోట్లు చెల్లించాల్సి ఉంది. రూ.15 కోట్లను నిర్ణీత గడువులోగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. విశాల్‌ రూ.15 కోట్లు చెల్లించకపోవడంతో ‘మార్క్ ఆంటోని’ సినిమా విడుదలపై కోర్టు స్టే విధించింది. సెప్టెంబర్ 12న విశాల్‌ను కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. సెప్టెంబర్ 15న ఇతర తమిళ సినిమాలేవీ విడుదల కాకపోవడంతో ‘మార్క్ ఆంటోని’ మూవీని సోలోగా విడుదల చేస్తే భారీ కలెక్షన్లు వస్తాయని మేకర్స్ భావించారు‌. కోర్టు ఆదేశాలతో చివరి క్షణంలో ప్లాన్‌ రివర్స్‌ అయింది. సెప్టెంబర్ 15లోగా విశాల్ రూ.15 కోట్లు చెల్లిస్తే కోర్టు స్టే ఎత్తివేసే అవకాశం ఉంది.

‘మార్క్ ఆంటోని’ సినిమాలో విశాల్‌తో పాటు ఎస్‌జే సూర్య కూడా నటించాడు. రీతూ వర్మ హీరోయిన్. ఈ మూవీకి అధిక్ రవిచంద్రన్ డైరెక్టర్. జీవీ ప్రకాష్ సంగీతం సమకూర్చారు. టైమ్‌ ట్రావెల్‌కు సైన్స్‌ ఫిక్షన్‌ను జోడించి ఈ సినిమాను రూపొందించారు. ఇటీవల రిలీజైన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. కామెడీ కూడా క్లిక్ కావడంతో ఈ సినిమాపై చిత్రబృందం చాలా ఆశలు పెట్టుకుంది.

విశాల్, లైకా ప్రొడక్షన్స్ మధ్య గత కొన్ని సంవత్సరాలుగా ఫైనాన్స్ విషయంలో విభేదాలు ఉన్నాయి. గోపురం సినిమా చేయడానికి ఫిలింస్టోకు చెందిన అన్బుచెలియన్ నుండి 21.29 కోట్లు అప్పుగా తీసుకున్నాడు విశాల్‌. దీనిని నిర్మాణ సంస్థ లైకా చెల్లించింది. అయితే విశాల్ లైకాకు డబ్బు తిరిగి ఇవ్వలేదు. పైగా ఇచ్చిన హామీలు, అగ్రిమెంట్లను కూడా విశాల్ ఉల్లంఘించాడు. దీంతో లైకా కోర్టును ఆశ్రయించింది నిర్ణీత గడువులోగా 15 కోట్లకు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అయితే విశాల్ ఆ మొత్తాన్ని ఇవ్వలేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu