ప్రజలకు నా విజ్ఞప్తి.. పబ్లిక్‌ హాలీడే కాదు..

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌.. జనతా కర్ఫ్యూ లో భాగంగా.. ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను పోస్ట్‌ చేస్తూ.. ‘అందరికీ నమస్కారం. నా పేరు సల్మాన్‌ఖాన్‌. కరోనా వైరస్‌ వల్ల ఏర్పడ్డ క్లిష్ట పరిస్థితుల్లో కూడా మన కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తోన్న వారందరికీ నా కృతజ్ఞతలు. ఈ రోజు నా విజ్ఞప్తి ఏంటంటే.. ప్రభుత్వం చెబుతున్న నియమాలను పాటించండి. ఎలాంటి పుకార్లను వ్యాప్తి చేయకండి. కరోనా వైరస్‌కు ఎవరూ అతీతులు కాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కనీస జాగ్రత్తలను పాటించి.. బయటకు రాకండి. ఇది పబ్లిక్‌ హాలీడే కాదు.’ అని పేర్కొన్నారు.

https://www.instagram.com/tv/B-AkBoaFUXM/?utm_source=ig_web_copy_link