HomeTelugu Newsమట్టి మనిషిగా సల్మాన్‌ ఖాన్

మట్టి మనిషిగా సల్మాన్‌ ఖాన్

Salmankhan mud soaked pic g

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఫాంహౌస్‌లో గర్ల్ ఫ్రెండ్స్‌తో కొన్నాళ్లు జాలీగా గడిపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పొలం పనులపై ఆసక్తి పెంచుకున్నాడు. లాక్‌డౌన్‌ సమయాన్ని తన ఫాంహౌస్‌లోనే గడుపుతున్నాడు. ఫాం హౌజ్‌లోని వ్య‌వ‌సాయ క్షేత్రంలో స‌ల్మాన్ నాటు వేస్తున్న‌ ఫొటో ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. తినేవాడి పేరు ధాన్యం మీద రాసి ఉంటుంది. జై జ‌వాన్ జై కిసాన్ అంటూ ఆ ఫొటోకి క్యాప్ష‌న్ కూడా ఇచ్చాడు సల్మాన్ ఖాన్. తాజాగా ఒంటినిండా బురదతో ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇన్‌స్టాలో పోస్ట్‌చేసిన సల్మాన్ రైతులందరినీ గౌరవించండి అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఫొటోను అభిమానులు వీపరీతంగా షేర్ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!