HomeTelugu Trendingటెర్రరిస్ట్‌గా సమంత?

టెర్రరిస్ట్‌గా సమంత?

8 16
సమంత అక్కినేని నాగ చైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. కథల విషయంలో కూడా తనకు సెట్‌ అయ్యే మాత్రలను మాత్రమే ఎంచుకుంటుంది. పెళ్లైన తర్వాత వీరిద్దరు కలిసి నటించిన మజిలీ చిత్రం హిటైంది. ఆతర్వాత సమంత నందినిరెడ్డి దర్శకత్వంలో నటించిన ఓ బేబీ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఇక ఇటీవల వచ్చిన 96 రీమేక్ ,జాను మాత్రం నిరాశ పరిచిన సమంత నటనకు మంచి గుర్తింపు వచ్చింది. సమంత తాజాగా మరోసారి నందిని రెడ్డి డైరెక్షన్‌లో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లలో కూడా సమంత బిజీ అవుతుంది. ఫ్యామిలీ మ్యాన్ మొదటి పార్ట్ హిట్‌ కావడంతో దానికి సీక్వెల్ తెరకెక్కించే యోచనలో ఉన్నారు. ఇక మొదటి పార్ట్ లో సందీప్ కిషన్, ప్రియమణి, మనోజ్ బాజ్పాయ్ నటించారు. ఇక ఈ సీక్వెల్ లో సమంత కూడా నటిస్తుందని తెల్సుతుంది. ఇక ఈ వెబ్ సిరీస్ స్పై త్రిల్లర్ గా తెరకెక్కుతుంది. ఇందులో సమంత నెగిటివ్ పాత్రలో నటించనున్నట్లు సమాచారం. అది ఒక టెర్రరిస్ట్ పాత్ర అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి

Recent Articles English

Gallery

Recent Articles Telugu