‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’ రీమేక్‌ చేయనున్న వెంకటేష్‌!

విక్టరీ వెంకటేశ్ రీమేక్‌ సినిమాలు చేయడంలో ఉత్సాహాన్ని చూపుతూ వస్తున్నారు. కథ .. కథనం బావుండి.. తన బాడీ లాంగ్వేజ్ కి సరిపోతుంది అనుకుంటే ఆయన వెంటనే రంగంలోకి దిగిపోతూ ఉంటారు. తాజాగా ఆయన తమిళంలో సక్సెస్ అయిన ‘అసురన్’ సినిమాని రీమేక్ ని ‘నారప్ప’ గా చేశారు. అలాగే మలయాళంలో విజయవంతమైన ‘దృశ్యం 2’ రీమేక్ లోను చేశారు. ఈ రెండు సినిమాలు కూడా విడుదలకు రెడీ అవుతున్నాయి.

ఇక తాజాగా ఆయన మరో మలయాళ మూవీని రీమేక్ లో చేయడానికి ఆసక్తిని చూపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కొంతకాలం క్రితం మలయాళంలో ‘డ్రైవింగ్ లైసెన్స్’ అనే సినిమా వచ్చింది. లాల్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ – సూరజ్ నటించారు. ఈ సినిమా విజయంతో పాటు ప్రశంసలు అందుకుంది. అందువలన ఈ సినిమా పట్ల వెంకటేశ్ ఉత్సాహంగా ఉన్నారని అంటున్నారు. ఈ సినిమా సురేశ్ బాబుకి కూడా నచ్చితే, పట్టాలెక్కడానికి పెద్ద సమయం పట్టదనే చెప్పాలి.

CLICK HERE!! For the aha Latest Updates