మరోసారి జంటగా చైతన్య, సమంత!

టాలీవుడ్‌ దంపతులు అక్కినేని నాగ చైతన్య, సమంత. వీరిద్దరు జంటగా వెండితెరపై ప్రేక్షకులను అలరించిన చిత్రం ‘మజిలీ’. అయితే మరోసారి ఈ జంట వెండితెరపై భార్యాభర్తలుగా కనిపించనున్నారు. తాజా సమాచారం ప్రకారం అక్కినేని నాగార్జున హీరోగా కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయన’. త్వరలో నాగ్‌-కల్యాణ్‌ కృష్ణ కాంబినేషన్‌లో ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రానికి సీక్వెల్‌ తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ‘బంగార్రాజు’ పేరుతో ఈ సినిమా రూపొందించనున్నారు. టైటిల్‌ పాత్రలో నాగార్జున కనిపించగా, మరో ముఖ్యపాత్రలో నాగచైతన్య నటించబోతున్నారని టాక్‌ వినిపిస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో చై పాత్రతోపాటు ఆయన భార్య పాత్ర కూడా కీలకమేనట. అందుకే ఆ పాత్రకు సమంతను ఎంపిక చేసే ఆలోచనలో దర్శకుడు కళ్యాణ్‌ కృష్ణ ఉన్నాడట. ప్రస్తుతం ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. వీరిద్దరు కలిసి నటించబోతున్నారని వార్తలు రావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.

CLICK HERE!! For the aha Latest Updates