HomeTelugu Big StoriesSamantha: గతంలో చేసిన తప్పు మళ్లీ రిపీట్‌ చేయకూడదు అనుకుంటున్నా: సమంత

Samantha: గతంలో చేసిన తప్పు మళ్లీ రిపీట్‌ చేయకూడదు అనుకుంటున్నా: సమంత

Samantha biggest mistake in

Samantha: టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రస్తుతం సినిమాలకు చిన్న బ్రేక్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. మయోసైటిస్ కారణంగా చికిత్స తీసుకుంటుంది. ఈ బ్యూటీ సినిమాలకు అయితే దూరంగా ఉంది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటుంది.

యాడ్స్ షూట్‌ లో పాల్గొనడంతో పాటు, సోషల్ మీడియాలో ఫోటోలను షేర్‌ చేయడం, స్టేజ్ షోల్లో కనిపిస్తునే ఉంది. ఇక ఈమె షేర్ చేసే ఫోటోలు, కొటేషన్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ ఉంటాయి. తాజాగా ఫ్యాన్స్ తో చిట్ చాట్‌ చేసింది సమంత.

ఆ నేపధ్యంలో ఆమో చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. మీ జీవితంలో చేసిన అతి పెద్ద పొరపాటు ఏంటి సమంత ను ప్రశ్నించారు. దీనికి సమంత ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది. నేను నా ఇష్టాలను, అయిష్టాలను తెలుసుకోవడంలో ఫెయిల్ అయ్యాను.

ఆ సమయంలో సరైన నిర్ణయం తీసుకోక పోవడం అతి పెద్ద పొరపాటు గా నేను భావిస్తున్నాను అన్నట్లుగా చెప్పుకొచ్చింది. నాతో ఉన్న వారితో, నా జీవిత భాగస్వామి వల్ల ఎక్కువగా ప్రభావితం అయ్యి నా ఇష్టాలను, నా అయిష్టాలను గుర్తించలేకపోయాను అన్నట్లుగా సమంత పేర్కొంది.

మొత్తానికి సమంత ఒక టైమ్‌లో తాను చాలా పెద్ద తప్పు చేశాను, ఆ తప్పు మళ్లీ చేయకూడదని భావిస్తున్నట్లుగా పేర్కొంది. వ్యక్తిగత జీవితంలో ఇష్టాలను తెలుసుకుని దానికి అనుగుణంగా వెళ్లక పోవడం అనేది జీవితంలో అతి పెద్ద తప్పుడు నిర్ణయం అవుతుందని, అదే అతి పెద్ద పొరపాటు అవుతుంది అన్నట్లుగా సమంత చేసిన వ్యాఖ్యల అర్థం అన్నట్లుగా నెటిజన్స్ డీ కోడ్‌ చేస్తున్నారు.

నాగ చైతన్య పై సమంత ఇండైరెక్ట్‌ గా కామెంట్స్ చేసిందని కూడా కొందరు అంటున్నారు. ప్రస్తుతానికి బ్రేక్ లో ఉన్న సమంత త్వరలోనే కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటనతో వస్తుందేమో చూడాలి.

 

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!