సమంత ఓ బేబీ పోస్టర్ విడుదల


సమంత టైటిల్‌ రోల్ పోషిస్తున్న “ఓ బేబీ” సినిమా పోస్టర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ సినిమా ప్రేక్షకుడికి చక్కటి వినోదం అందిస్తుందని సమంత అన్నారు. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నాగశౌర్య, రావు రమేశ్‌, లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ప్రముఖ సంస్థ సురేష్‌ ప్రొడక్షన్స్‌ స్థాపించి 55 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు చెప్పారు.

55 ఏళ్ల లెజెండరీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నందుకు శుభాకాంక్షలు సురేష్‌ ప్రొడక్షన్స్‌కు శుభాకాంక్షలు. మీ సంస్థలో వస్తోన్న తర్వాతి ప్రాజెక్టులో నటించడం సంతోషంగా ఉంది. “ఓ బేబీ” నుంచి స్వాతి ని (పాత్ర) పరిచయం చేస్తున్నాం. ఎంజాయ్‌మెంట్‌ మామూలుగా ఉండదు అని ట్వీట్‌ చేశారు. దీనికి నాగచైతన్య రిప్లై ఇచ్చారు. ఓ బేబీ సమంత.. ఈ సినిమాలో నిన్ను అందరికీ చూపించాలని చాలా ఆతృతగా ఉంది. ఇందులోని పాత్ర నిన్ను పోలి ఉంది. మొత్తం చిత్ర బృందానికి ఆల్‌ ది బెస్ట్‌ అని పేర్కొన్నారు.