HomeTelugu Trendingఏపీలో సమంతకు గుడి కట్టిన అభిమాని

ఏపీలో సమంతకు గుడి కట్టిన అభిమాని

samantha temple in AP

తమిళనాడు తమ అభిమాన నటీనటులకు గుడి కట్టడం మనం ఎప్పటి నుంచో ఉంది. తొలిసారిగా సినీఇండస్ట్రీలో ఫ్యాన్స్‌ చేత గుడి కట్టించుకున్న ఏకైక హీరోయిన్ ఖుష్బూ. ఆ తరువాత.. త‌రువాత‌ హన్సిక, నమిత, నిధి అగర్వాల్ లకు త‌మ అభిమానులు గుళ్ళు క‌ట్టించారు. తాజాగా స‌మంత వీరి జాబితాలో చేర‌బోతోంది. కాగా 1991వ సంవత్సరంలో ఖుష్బూ కోసం ఆమె అభిమానులు గుడి కట్టారు. ఎంతో అభిమానంతో ఖుష్బూకి గుడి కట్టిన వారే కొన్ని కార‌ణాల వ‌ల్ల‌ ఆమె గుడిని కూల్చివేశారు.

ఇప్పుడు ఏపీలో కూడా ఆ ట్రెండ్ ప్రారంభమైంది. టాలీవుడ్‌లో ఏమాయచేశావే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది సమంత. ఆతరువాత తన అందం, అభినయం, తన నటనతో టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండానే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే స్టార్‌ నటిగా గుర్తింపు తెచ్చుకుంది.

సమంతపై ఉన్న అంతులేని అభిమానంతో ఆమెకు ఓ అభిమాని గుడి కట్టేశాడు. వివరాల్లోకి వెళ్తే బాపట్ల జిల్లా చుండూరు మండలం ఆలపాడుకు చెందిన తెనాలి సందీప్ అనే వ్యక్తి సమంతకు వీరాభిమాని. నటిగా ఆమెను ఎంతో ఆరాధించే సందీప్.. ఆమె చేసే పలు సేవా కార్యక్రమాలకు మరింత ఆకర్షితుడయ్యాడు.

ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయిస్తుండటంలో ఆమె చూపిస్తున్న చొరవకు ఆయన అభిమానం ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది. ఆమెకు గుడి కట్టించాలని సంకల్పించాడు. తన ఇంటి ఆవరణలోనే గుడి కట్టిస్తున్నాడు. ప్రస్తుతం విగ్రహానికి, గుడికి తుది మెరుగులు దిద్దే పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు సమంతను తాను నేరుగా చూడలేదని… కానీ, ఆమెపై అభిమానంతో గుడి కట్టిస్తున్నానని చెప్పాడు. ఈ నెల 28న గుడిని ప్రారంభిస్తున్నానని తెలిపాడు.

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!