HomeTelugu Trendingసంపూర్ణేష్‌ బాబు 'క్యాలీఫ్లవర్‌' ఫస్ట్‌లుక్‌

సంపూర్ణేష్‌ బాబు ‘క్యాలీఫ్లవర్‌’ ఫస్ట్‌లుక్‌

Sampoornesh babu Cauliflow

టాలీవుడ్ బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్ బాబు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈసారి మరో ప్రయోగంతో దూసుకొస్తున్నాడు. అతడి గెటప్ అసాధారణంగా ఉంటుందని తాజాగా రిలీజైన ఫస్ట్ లుక్ చెబుతోంది. నేడు సంపూ బర్త్ డే సందర్భంగా కెరీర్ ఐదో సినిమా ‘క్యాలీఫ్లవర్’ లుక్ లాంచ్ అయ్యింది. గుర్రంపై సంపూ దూసుకొస్తున్న ఈ విజువల్ మైండ్ బ్లాక్ చేస్తోంది. గాంధీజీ స్వాతంత్య్రం తెస్తే.. సర్‌ర్ధర్ కాటన్ బ్యారేజీ నిర్మిస్తే.. భారతదేశ మహిళల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటడానికి ఇంగ్లండ్ నుంచి దిగాడు ఈ క్యాలీఫ్లవర్!!

పూర్తి కామెడీ ఎంటర్ టైనర్. ఆర్.కె.మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. గోపి కిరణ్ ఈ కథను రాయగా.. మధుసూధన క్రియేషన్స్, రాధాకృష్ణ టాకీస్ బ్యానర్ లలో ఆశా జ్యోతి గోగినేని నిర్మిస్తున్నారు. శ్రీధర్ గూడూరు ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ సినిమాలో వసంత హీరోయిన్‌గా నటిస్తుంది. పోసాని కృష్ణ మురళి, పృథ్వీ, నాగ మహేష్, గెటప్ శ్రీను, రోహిణి, కాదంబరి కిరణ్, కల్లు కృష్ణారావు తదితరులు తారాగణం. ప్రజ్వాల్ క్రిష్ సంగీతం అందిస్తుండగా.. ముజీర్ మాలిక్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ మూవీ షూట్ ఇటీవల ప్రారంభమైంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!