HomeTelugu Trendingసెలబ్రెటీలపై సానియా మీర్జా ఫైర్‌.. నెటిజన్ల ప్రశంసలు

సెలబ్రెటీలపై సానియా మీర్జా ఫైర్‌.. నెటిజన్ల ప్రశంసలు

9 3
ప్రముఖ టెన్నిస్ ప్లేయర్‌ సానియా మీర్జా సెలబ్రిటీల తీరుపై మండిపడింది. లాక్ డౌన్ పీరియడ్ లో పేద ప్రజలు, ఆశ్రయం లేని వారు అల్లాడుతున్నారు.కాగా కొందరు సెలెబ్రెటీలు తమకు ఏమి పట్టనట్టుగా వారు ఇంట్లో కుర్చోని వంటల వీడియోలు, వారి వ్యాయామం వీడియోలు పోస్ట్‌ చేస్తున్నారు. అయితే వాటి వల్ల ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదన్న విషయం తెలిసిందే. దీంతో సానియా అలాంటి వారి తీరుపై మంది పడింది. “ఇప్పటికీ మనం వంటల వీడియోలు, ఆహారానికి సంబంధించిన ఫొటోలతోనే సరిపెడుతున్నామా? అవతల వేలమంది ప్రజలు మృత్యుకోరల్లో చిక్కి విలవిల్లాడుతున్నారు. కొందరు ఆకలితో ఆలమటిస్తూ ఒక్కపూట తిండి దొరికినా అదృష్టవంతులమే అనుకుంటున్నారు. అలాంటి వారి కోసం ఆలోచించండి” అంటూ ట్వీట్ చేసింది. సానియా చేసిన ఈ ట్వీట్‌ పై నెటిజన్ల ప్రశంసలు కురిపిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!