సంతోష్‌ శోభన్‌తో సినిమా చేయనున్న సుస్మిత!


చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసిన సంగతి. కొన్ని రోజుల క్రితం భర్త విష్ణుప్రసాద్‌తో కలిసి గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ అనే నిర్మాణ సంస్థను స్థాపించింది. ఈ బ్యానర్ పై ఆమె వెబ్ సిరీస్ లు నిర్మిస్తుంది. ఇప్పటికే ఆ బ్యానర్‌లో ‘షూటౌట్‌ ఎట్‌ ఆలేరు’ అనే వెబ్‌ సిరీస్‌ను కూడా నిర్మించింది. ఇక సినిమాలను కూడా నిర్మించేందుకు సిద్ధమౌతుంది. తమిళంలో సూపర్‌ హిటైన ‘8 తూట్టాక్కళ్‌’ (8బుల్లెట్లు) అనే సినిమాను తెలుగులో రీమేక్‌ చేయాలని భావిస్తుందట.

ఇప్పటికే మూవీ రీమేక్‌ హక్కులను కూడా కొన్నారట. గణేశ్‌ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాలో సంతోష్‌ శోభన్‌ను హీరోగా ఫైనల్‌ చేయారట. ‘ఏక్ మినీ కథ’ సినిమాతో క్రేజ్‌ సంపాదించుకున్న సంతోష్‌ శోభన్‌కు యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ ఏర్పడింది. దీంతో ఇప్పటికే ఆయనకు పలు సినీ అవకాశాలు వస్తున్నాయి. తాజాగా నందిని రెడ్డి సినిమాలో ఛాన్స్‌ కొట్టేసినట్లు ఫిల్మ్‌నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి‌. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రానున్నట్లు సమాచారం.

CLICK HERE!! For the aha Latest Updates