మహేష్ ‘సరిలేరు నీకెవ్వరూ’ బడ్జెట్?

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు 26 వ సినిమా సరిలేరు నీకెవ్వరూ సినిమా మే 31 వ తేదీన ప్రారంభమైంది. జూన్ 26 వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నది. మహేష్ విదేశాల నుంచి తిగిరి వచ్చిన తరువాత షూటింగ్లో పాల్గొంటారు. ఈ సినిమాకు ముగ్గురు నిర్మాతలు ఉండటంతో.. దీనికి కూడా భారీ బడ్జెట్ పెట్టబోతున్నారని అవుతున్నారు.

దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబులు ముగ్గురు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దీనికి కారణం ఏంటి.. ఎందుకని ముగ్గురు నిర్మాతలుగా ఉండబోతున్నారు. ఈ సినిమాకు కూడా భారీ బడ్జెట్ ఉండబోతుందని అర్ధం అవుతున్నది. ఈ కారణంగానే ముగ్గురు నిర్మాతలు ఉంటున్నారని, ముగ్గురు ఉంటేనే ఒకవేళ కొంత బడ్జెట్ పెరిగినా సమానంగా పెట్టె అవకాశం ఉంటుంది. ఒక్కరే భారాన్ని మోయడం కంటే.. ముగ్గురైతే ఈజీగా ఉంటుంది కదా. రష్మిక హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు