దిల్‌రాజు ఆఫీస్‌లో ఐటీ సోధాలు

అమీర్‌పేట శ్రీనగర్‌ కాలనీలోని ప్రముఖ సినీ నిర్మాత దిల్‌రాజు ఆఫీస్‌లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోధాలు చేపట్టారు. ప్రత్యేక బృందంగా ఏర్పడిన ఐటీ అధికారులు కార్యాలయంలోని రికార్డులను పరిశీలిస్తున్నారు. ‘మహర్షి’ సినిమా విడుదల నేపథ్యంలో దిల్‌రాజు కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన మహర్షి సినిమా గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దిల్‌రాజుతో పాటు పొట్లూరి వరప్రసాద్‌(పీవీపీ), అశ్వనీదత్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.