సమంతను ఫాలో అవుతున్న సాయేషా


‘వనమగన్’ చిత్రంతో కోలీవుడ్‌లో అడుగుపెట్టిన సాయేషా.. నటుడు ఆర్యను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గత నెల 10వ తేదీన వీరి వివాహం ఘనంగా జరిగింది. పెళ్లికి ముందుగానే సూర్యతో ‘కాప్పాన్‌’, జీవీ ప్రకాశ్‌తో ‘వాచ్‌మెన్‌’, కన్నడలో ‘యువరత్న’ తదితర చిత్రాల్లో సాయేషా నటించారు. ఈ నేపథ్యంలో పెళ్లి తర్వాత తాజాగా ‘యువరత్న’ సినిమా చిత్రీకరణలో ఆమె పాల్గొన్నారు. అలాగే కాప్పాన్‌ తదితర సినిమాల్లోనూ ఆమె నటించనున్నట్లు సమాచారం. నటి సమంత పెళ్లి తర్వాత కూడా నటిస్తూ బిజీగా ఉంటోంది. పెళ్లి తర్వాత నటిస్తూ బిజీగా ఉన్న నాయికల్లో సమంత ముందు వరుసలో ఉంది. ఆమెలాగే సాయేషా కూడా ఎక్కువ సినిమాల్లో నటించనున్నట్లు సమాచారం.

CLICK HERE!! For the aha Latest Updates