మహానటి కోసం వెతుకులాట

ఎన్టీఆర్ జీవితాన్ని బయోపిక్ రూపంలో ఆయన తనయుడు బాలకృష్ణ ఆవిష్కరించే ప్రయత్నంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ సినీ జీవితాన్ని విశేషంగా చూపనున్నారు. అందుకోసం అలనాటి నటీనటుల పాత్రలు ఏఎన్నార్, ఎస్‌.వి. రంగారావు, సావిత్రి, శ్రీదేవి లాంటి వారి పాత్రలు కూడ కథలో చేర్చారు.

ఆ పాత్రల కోసం నటీనటుల్ని వెతికే పనిలో సావిత్రి రోల్ కోసం ‘మహానటి’ చిత్రంలో సావిత్రిగా జీవించిన కీర్తి సురేష్ ను అడిగారట. కానీ కీర్తి సురేష్ సావిత్రిగారి పాత్రను ‘మహానటి’లో చేసినట్టు మళ్ళీ చేయడం, అసాధ్యమని, ‘మహానటి’ అనేది తన కెరీర్ కు ఒక కిరీటం లాంటిదని, మరోసారి దాన్ని టచ్ చేయడం ఇష్టంలేక ఒప్పుకోలేదని అన్నారు. దీంతో క్రిష్ అండ్ టీమ్ ఆ పాత్ర కోసం మరొక నటిని వెతికే పనిలో పడ్డారు.