HomeTelugu Trending'సీనయ్య' ఆగిపోయిందా.?

‘సీనయ్య’ ఆగిపోయిందా.?

8 11
మాస్ మూవీలు తెరకెక్కించడంలో ప్రేక్షకుల అభిరుచి తెలిసిన దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు డైరెక్టర్‌ వినాయక్. అలాంటి వినాయక్ హీరోగా కొత్త అవతారం ఎత్తి ‘సీనయ్య’ సినిమా చేస్తున్నాడు. ‘దిల్’ రాజు నిర్మాణంలో .. ‘శరభ’ ఫేమ్ నరసింహా దర్శకత్వంలో ‘సీనయ్య’ సినిమా చేయడానికి వినాయక్ అంగీకరించాడు. పాత్ర పరంగా కాస్త సన్నగా కనిపించడంకోసం గట్టిగానే కసరత్తులు చేశాడు.

ఇటీవలే ఈ సినిమా తొలి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. రషెస్ చూసిన తరువాత వినాయక్ అసంతృప్తిని వ్యక్తం చేశాడట. ఈ ప్రాజెక్టును ఇక్కడితో ఆపడమే మంచిదని చెప్పాడట. అందుకు ‘దిల్’ రాజు అంగీకరించడం కూడా జరిగిపోయిందని అంటున్నారు. మొత్తం మీద ఈ ప్రాజెక్టు ఆగిపోయిందనే మాట బలంగానే వినిపిస్తోంది. ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!