HomeTelugu Newsకరోనా ని పట్టించుకోని నాగచైతన్య డైరెక్టర్‌

కరోనా ని పట్టించుకోని నాగచైతన్య డైరెక్టర్‌

11 17

కరోనా మహమ్మారి బారిన పడి ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. కొన్ని దేశాల్లో ఇప్పటికే ప్రధాన నగరాలు షట్ డౌన్ అయ్యాయి. ఇక భారత్ లో ఇప్పటికే సినిమా థియేటర్స్, షాపింగ్ మాల్స్ అన్ని బంద్ అయ్యాయి. సినిమా షూటింగ్ లు కూడా ఆపేసారు. సినిమాల విడుదల తేదీలు కూడా చాలా వరకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.. ఇదిలా ఉంటే టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ముల మాత్రం కరోనా కు భయపడేది లేదంటున్నాడు. కనోనాను లైట్ గా తీసుకొని సైలెంట్ గా సినిమా షూటింగ్ కనిచేస్తున్నాడు.

ఫిదా సినిమా తో సూపర్ హిట్ అందుకున్న ఈ దర్శకుడు ప్రస్తుతం ‘లవ్ స్టోరీ’ అనే సినిమా చేస్తున్నాడు. అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య , బ్యూటీఫుల్ సాయిపల్లవి తో కలిసి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం నిజామాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. కానీ కరోనా వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాను పూర్తి చేస్తున్నారని తెలుస్తుంది. ఎలాగైనా సమ్మార్ లో ఈ సినిమాను విడుదల చెయ్యాలని శేఖర్ కమ్ముల దృడ సంకల్పంతో ఉన్నడట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!