‘భూతద్ధం భాస్కర్‌ నారాయణ’ ఫస్ట్‌ గ్లింప్స్‌

డిఫరెంట్‌ టైటిల్‌తో వస్తున్న తాజా చిత్రం ‘భూతద్ధం భాస్కర్‌ నారాయణ’. పురుషోత్తం రాజ్‌ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, స్నేహల్‌ జంగాల, శశిధర్‌ కాశి, కార్తీక్‌ ముడుంబై సంయుక్తంగా మిలియన్‌ డ్రీమ్స్‌ క్రియేషన్స్‌ మరియు విజయ సరాగ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌ పై నిర్మించిన సినిమా ఇది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ గ్లింప్స్‌ ని మంగళవారం విడుదల చేశారు. ఈ చిత్రంలో శివ కందుకూరి హీరోగా, రాశి సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఈ గ్లింప్స్‌ ని చూస్తే ఇది ఒక మైథాలజీ నేపథ్యంలో జరిగే ఇంట్రెస్టింగ్‌ స్టోరీలా అనిపించడమే కాదు, గ్రామీణ వాతావరణంలో జరిగే ఒక డిటెక్టివ్‌ కథలా కూడా అనిపిస్తుంది. ఈ చిత్రానికి శ్రీచరణ్‌ పాకాల, విజయ్‌ బుల్గానిన్‌ సంగీతం అందించారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ శరవేగంగా జరుగుతున్నాయి. మరిన్ని వివరాలు అతి త్వరలో తెలియజేస్తామని చిత్ర యూనిట్‌ పేర్కొంది.

CLICK HERE!! For the aha Latest Updates