HomeTelugu Reviews'గీతా ఆర్ట్స్2' తో పని చేయడంపై శివాని కామెంట్స్‌

‘గీతా ఆర్ట్స్2’ తో పని చేయడంపై శివాని కామెంట్స్‌

Shivani rajasekhar comments
గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై నిర్మాణంలో.. శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పిఎస్‌’. తేజ మార్ని దర్శకత్వం వహించిన ఈ సినిమా మలయాళంలో 2021లో వచ్చిన ‘నాయట్టు’ చిత్రానికి రీమేక్‌.

ఈ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో.. శివానీ రాజ‌శేఖ‌ర్ కి..ఈ చిత్రంలో మీరు గీతా ఆర్ట్స్ 2 లో ప‌ని చేయడం కొంతమందికి ఆశ్చర్యంగా ఉంది.. మీరు ఎలా ఫీలవుతున్నారు? అనే ప్రశ్న ఎదురైంది.

దీనికి శివానీ బదులిస్తూ.. ”ఇక్కడ వ్యక్తిగత జీవితం భిన్నంగా ఉంటుంది. వృత్తిగ‌త‌ జీవితం వేరు.. వ్యక్తిగత జీవితం వేరు. వ్య‌క్తులుగా ఎవరి ఆలోచనలు..అభిప్రాయాలు వారివి. ఏదో ఒక సమయంలో అపోహలు..అపార్థాలు తలెత్తి ఉండవచ్చు. సినిమాగా చూస్తే మేమంతా ఒక కుటుంబమే. వ్యక్తిగతంగా చూసినా కొట్లాట‌లు లాంటిదేమీ జరగలేదు.

ఇలా అయింది అలా అయింది అని రాస్తారు. మేం మాట్లాడుకుంటున్నాం. అంతా అయిపోయింది.. ఇప్పుడంతా ఓకే” అని అన్నారు. ఈతరం హీరోయిన్‌లకు సినిమాలు, వెబ్ సినిమాల‌తో బోలెడ‌న్ని అవ‌కాశాలొస్తున్నాయి. శివానీ న‌ట‌నారంగంలో త‌న కెరీర్ ఎదుగుద‌ల కోసం ప్ర‌స్తుతం హార్డ్ వర్క్ చేస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!