HomeTelugu Trending'WWW' నుండి శివాని రాజశేఖర్‌ న్యూలుక్‌

‘WWW’ నుండి శివాని రాజశేఖర్‌ న్యూలుక్‌

Shivani rajasekhar special

అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’(హూ వేర్ వై). ఈ రోజు (జులై 1) హీరోయిన్ శివాని రాజ‌శేఖ‌ర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆమె స్పెష‌ల్ బ‌ర్త్‌డే పోస్ట‌ర్ ని విడుద‌ల‌చేసి శుభాకాంక్ష‌లు తెలిపింది చిత్ర యూనిట్‌. ఈ మూవీలో `మిత్ర` అనే పాత్ర‌లో శివాని న‌టిస్తున్న‌ట్లు తెలిపారు మేక‌ర్స్‌. ఆహ్లాద‌క‌రంగా ఉన్న ఈ స్పెష‌ల్ పోస్ట‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.

నిర్మాత డా. రవి పి.రాజు దాట్ల మాట్లాడుతూ .. ”ముందుగా మా హీరోయిన్ శివాని రాజ‌శేఖ‌ర్ గారికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు. ఈ మూవీలో ‘మిత్ర’ అనే పాత్ర‌లో న‌టించారు. చాలా ఛాలెంజింగ్ పాత్ర అయిన‌ప్ప‌టికీ త‌న న‌ట‌న‌తో పూర్తిన్యాయం చేశారు. గుహ‌న్ గారి స్టైలిష్ మేకింగ్‌, అదిత్, శివానిల అద్భుత‌మైన న‌ట‌న డెఫినెట్‌గా ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయి” అన్నారు.

రామంత్ర క్రియేషన్స్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా డా. రవి పి. రాజు దాట్ల నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్స్‌, అలాగే ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజైన‌ టీజ‌ర్‌, లిరిక‌ల్ సాంగ్స్‌కి ట్రెమండ‌స్ స్పందన వచ్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!