ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ!

యంగ్ రెబల్ స్టార్… ప్రభాస్ హీరోగా నాలుగు భాషల్లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న చిత్రం సాహో. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ ఎవరనే సస్పెన్స్ వీడింది. ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. హిందీలో ఆషికీ 2 చిత్రంతో అందరి మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకొొని… పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన శ్రద్ధా కపూర్ సాహో చిత్రంతో తెలుగు తెరకు పరిచయం కానుంది.  
 
రన్ రాజా రన్ చిత్రంతో సూపర్ హిట్ అందించిన సుజీత్ సాహో చిత్రానికి దర్శకుడు. యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈ హై టెక్ యాక్షన్ డ్రామా చిత్రాన్ని ఏక కాలంలో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రూపొందించబోతున్నారు. ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఇందులో భాగం కానున్నారు. మైమరపించే యాక్షన్ సన్నివేశాలను అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల పర్యవేక్షణ లో విదేశాల్లో చిత్రీకరిస్తున్నారు. బాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ త్రయం శంకర్ -ఎహసాన్-లాయ్ ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నారు. హిందీ లిరిక్స్ ను… అమితాబ్ భట్టాచార్య అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మధి, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరీల్ లాంటి టాప్ టెక్నీషియన్స్ సాహో చిత్రానికి వర్క్ చేస్తుండడం విశేషం.  ప్రేక్షకుల, అభిమానుల అంచనాలను అందుకునేలా ప్రభాస్ స్టైలిష్ గా, ఓ కొత్త ఎనర్జీ తో కనిపించబోతున్నారు.