రెస్టారెంట్‌ స్టార్ట్‌ చేసిన నాని హీరోయిన్‌..


నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటించిన జెర్సీ సినిమాలో హీరోయిన్‌ శ్రద్ధా శ్రీనాథ్ కొత్త బిజినెస్ మొదలుపెట్టింది. నానితో రొమాన్స్ చేసిన ముద్దుగుమ్మకు కన్నడలో మంచి క్రేజ్ ఉంది. అక్కడ వరస సినిమాలు కూడా చేస్తుంది

జెర్సీలో ఈమె నటనకు ఇక్కడ కూడా మంచి మార్కులు పడ్డాయి. ప్రేక్షకులతో పాటు దర్శక నిర్మాతలు కూడా ఫిదా అయిపోయారు. వరస సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్ కూడా మొదలుపెట్టింది. చెన్నైలో ‘పర్ సే’ పేరుతో ఓ రెస్టారెంట్ ప్రారంభించింది శ్రద్ధా శ్రీనాథ్. అందులో ఫుడ్స్ కంటే కూడా సలాడ్స్ ఎక్కువగా ఉంటాయి. సమ్మర్ సీజన్ కావడంతో బిజినెస్ కూడా బాగుంటుందని నమ్ముతుంది ఈ ముద్దుగుమ్మ. రెగ్యులర్ బర్గర్స్, సాండ్ విచ్ లాంటి ఫుడ్స్ కాకుండా హెల్తీ ఫుడ్ తమ రెస్టారెంట్‌లో ఉంటుందని శ్రద్ధా శ్రీనాథ్ చెబుతుంది. మరి ఈమె సినిమాలతో పాటు బిజినెస్‌ను ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలిక.