HomeTelugu Trendingకమల్‌ హాసన్‌ కాలికి శస్త్ర చికిత్స

కమల్‌ హాసన్‌ కాలికి శస్త్ర చికిత్స

Shruti and akshara clarity
ప్రముఖ సినీన‌టుడు క‌మ‌ల‌హాస‌న్ ఆరోగ్యంపై సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలకు ఆయన కుమార్తెలు శృతిహాసన్‌, అక్షర హాసన్ ట్విట్టర్‌ వేదికగా క్లారిటీ ఇచ్చారు. కమల్‌ హాసన్‌ కాలికి శస్త్ర చికిత్స జరిగిందని శృతి, అక్షర హాసన్‌ తెలిపారు. నాలుగైదు రోజులు హాస్పిటల్‌లోనే కమల్‌ ఉంటారని, తర్వాతే డాక్టర్స్‌ ఆయన్ని డిశ్చార్స్‌ చేస్తారని తెలిపారు. కమల్‌ కాలి ఆపరేషన్‌ను చెన్నైలోని రామచంద్ర హాస్పిటల్‌లో నిర్వహించారని, కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని, తర్వాత ఆయన మళ్లీ ప్రజలను ఎప్పటిలాగే కలుసుకుంటారని శృతి, అక్షర తెలిపారు. ఈ ఏడాది ప్రథమార్థంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మక్కల్‌ నీది మయ్యం పార్టీని స్థాపించిన కమల్‌ హాసన్‌ గత కొన్నిరోజులుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు కాలు నొప్పి రావడంతో పరీక్షించిన డాక్టర్స్ ఆపరేషన్‌ నిర్వహించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!