కూతుర్ని పరిచయం చేసిన గీతామాధురి

ప్రముఖ సింగర్‌ గీతామాధురి ఇటీవల తల్లి అయిన విషయం తెలిసిందే. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చానని ఆమధ్య గీతా సోషల్ మీడియాలో తెలిపింది. అయితే ఇంతవరకు తన కుమార్తెను పరిచయం చేయలేదు. తాజాగా ఆమె తన కూతుర్ని అభిమానులకు పరిచయం చేస్తూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేసింది. ‘అందరికీ నమస్కారం , నాపేరు దాక్షాయణి ప్రకృతి. మీ గీత, నందుల బ్లాక్‌బస్టర్‌ బేబీ నేనే’ అంటూ తన ముద్దుల కూతురి ఫోటోలను ఇన్‌స్టా గ్రామ్‌లో గీతా మాధురి పంచుకుంది.

చాలా క్యూట్‌గా వుందని.. పేరు చాలా బాగుందని ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మీ కూతుర్ని కూడా మీలా గాయనిగా మార్చండి అని చెబుతున్నారు. కాగా, గీతామాధురి, నటుడు నందు ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వారికి ఆగస్టు 9న పాప పుట్టింది.