డిశ్చార్జ్ అయిన ఎస్‌. జానకి

ప్రముఖ గాయని ఎస్.జానకి ప్రమాదవశాత్తు జారిపడి గాయపడ్డారు. మైసూరులోని తన బంధువుల ఇంటికి వెళ్లిన జానకి అనుకోకుండా కాలుజారి కిందపడటంతో ఆమె తుంటి ఎముకకు గాయమైంది. వెంటనే అబంధువులు ఆమెను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు ఆమెకు చిన్నపాటి సస్త్ర చికిత్స నిర్వహించారు. సజరీ విజయవంతమైందని, త్వరలోనే ఆమె కోలుకుంటారని అక్కడి వైద్యులు తెలిపారు. సర్జరీ అనంరం డిశ్చార్జ్ అవుతూ మీడియాతో మాట్లాడిన జానకి అందరి ప్రార్థనల వలన తాను బాగానే ఉన్నానని అన్నారు.