పవన్ తమ్ముడు కేసు పెట్టాడు!

పవన్ కల్యాణ్ నటిస్తోన్న ‘కాటమరాయుడు’ సినిమాలో నటుడు శివబాలాజీ, పవన్ కు తమ్ముడిగా కనిపించబోతున్నాడు. గతంలో హీరోగా రెండు, మూడు సినిమాలు చేసిన శివబాలాజీ ఈ మధ్యన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటిస్తున్నాడు. అయితే రీసెంట్ గా ‘కాటమరాయుడు’ సినిమా డబ్బింగ్ పూర్తయిందని శివబాలాజీ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. దీంతో కొందరు శివబాలాజీను తిడుతూ అతడి పేజీలో కామెంట్స్ పెట్టాడు. దీంతో ఆగ్రహించిన శివబాలాజీ ఎవరో కావాలనే వెనుక ఉండి ఇదంతా చేస్తున్నారని పోలీసులను ఆశ్రయించాడు.
తను సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడొద్దని ఎన్నిసార్లు మర్యాదపూర్వకంగా చెప్పినా.. వినకుండా పలుమార్లు ఇలా రెచ్చిపోవడంతో శివబాలాజీను పోలీసులను కంప్లైంట్ చేశాడు. సోషల్ మీడియాలో స్వేచ్చ పేరుతో ఎవరికి నచ్చినట్లు వారు కామెంట్స్ పెట్టుకోవడం సాధారణంగా మారిపోయింది. కొన్ని సార్లు వ్యవహారాలు అరెస్టుల వరకు వెళ్ళిన సంధర్భాలు ఉన్నాయి. మరి ఇకనైనా.. శివబాలాజీకి ఈ విషయంపై ఊరట కలుగుతుందేమో చూడాలి!