HomeTelugu Trendingపుష్ప: మాస్ పార్టీకి సిద్ధం కండి

పుష్ప: మాస్ పార్టీకి సిద్ధం కండి

Sizzling song of the year f
ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్- సుకుమార్ కాంబోలో వస్తున్నా మూడో చిత్రం ‘పుష్ప’. ఈ సినిమా మొదటి భాగం క్రిస్టమస్ సందర్భంగా డిసెంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. కానున్న ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్, పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఇక తాజాగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే సిజ్లింగ్ అప్డేట్ ని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత ఒక స్పెషల్ సాంగ్ చేయబోతున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఈ పాట షూటింగ్ పూర్తిచేసుకోగా బన్నీ, సామ్ మాస్ స్టెప్పులతో ఇరగదీశారని చిత్రబృందం చెప్తోంది. ‘ఊ అంటావా.. ఊహు అంటావా’ అంటూ సాగే ఈ పాటను డిసెంబర్ 10 న రిలీజ్ చేస్టున్నట్లు మేకర్స్ తెలిపారు. ‘మాస్ పార్టీకి సిద్ధం కండి .. సిజ్లింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్’ అంటూ సామ్ న్యూ పోస్టర్ తో అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఇక పోస్టర్ లో సామ్ బ్లూ కలర్ తళుక్కు టాప్ లో సెక్సీ లుక్ తో అదరగొట్టేసింది.. ప్రొఫెషనల్ ఐటెం భామలా కనిపించడంతో అమ్మడి ఎక్స్ ప్రెషన్స్, బన్నీ ఊర మాస్ స్టెప్స్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉంటాయని తెలుస్తోంది. మరి సామ్ మొదటి ఐటెం సాంగ్ ఎంతటి రచ్చ క్రియేట్ చేస్తుందో చూడాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!