HomeTelugu Trendingకరోనాతో స్పెయిన్ యువరాణి మృతి

కరోనాతో స్పెయిన్ యువరాణి మృతి

3 28

స్పెయిన్‌ రాజకుటుంబానికి చెందిన యువరాణిని కరోనా మహమ్మారి మింగేసింది. స్పెయిన్ యువరాణి 86 ఏళ్ల మారియా థెరిసా కరోనా సోకడంతో కన్నుమూసినట్లు ఆమె సోదరుడు ప్రకటించారు. పారిస్‌లో కరోనాతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అయితే ఈ సమాచారం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శుక్రవారమే ఆమె అంత్యక్రియలు పూర్తయినట్లు స్థానిక మీడియా పేర్కొంది. సోషియాలజీ ప్రొఫెసర్‌గా పనిచేసిన మారియా స్పెయిన్‌ రాజు ఫెలిప్‌-6కు సోదరి. ప్రపంచంలో రాజ కుటుంబంలోని వ్యక్తి కరోనా వల్ల మరణించడం ఇదే తొలిసారి. 1933 జులై 28 న జన్మించిన మారియా ఫ్రాన్స్‌లో చదువుకున్న మారియా సామాజిక కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించి ‘రెడ్‌ ప్రిన్సెస్‌’గా పేరు సంపాదించారు. స్పెయిన్‌లో ఇప్పటి వరకు 73 వేలమందికి పైగా కరోనా బారిన పడ్డారు. వీరిలో 12,285 మంది కోలుకోగా మరో 5,982 మంది మృతిచెందారు. మృతుల్లో వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారే ఎక్కువ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu