ఫేస్‌బుక్ లో శ్రీరెడ్డి ప్రేలాపన.. ఈ వ్యాఖ్యలు ఎవరిపైనో?

వివాదాస్పద నటి శ్రీరెడ్డి.. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో చాలా రోజుల తరువాత లైవ్‌లోకి వచ్చి కారును తొక్కేయండి.. కూటమిని గెలిపించండి అంటూ కేసీఆర్, కేటీఆర్‌లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తాజాగా తన ఫేస్‌బుక్ పేజీలో పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్ అయింది. అయితే ఎవరి పేర్లు ప్రస్తావించకుండా పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లేడీస్ లేకుండా కొడుక్కి నిద్రపట్టదు, మందు లేకుండా తండ్రికి నిద్రపట్టదు అంటూ ఆమె ఈ కామెంట్స్ చేశారు.

శ్రీరెడ్డి.. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌కి సవాల్ విసిరింది. గతంలో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి ఎలాంటి గతి పట్టిందో జనసేన పరిస్థితి కూడా అంతే అంటూ శాపనార్ధాలు పెట్టిన శ్రీరెడ్డి.. పవన్ కళ్యాణ్ వార్డు మెంబర్‌గా కూడా గెలవరంటూ అప్పట్లో సంచలనానికి తెర తీసింది. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్‌ను, జనసైనికుల్ని రెచ్చిగొట్టే వ్యాఖ్యలు చేసింది. ఫేస్ బుక్‌ లైవ్‌లో మాట్లాడుతూ.. ‘ఎవర్నీ వదిలిపెట్టేది లేదు.. నా శపథం నెరవేరకుండా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. పవన్ కళ్యాణ్‌కి ఇంకా టైమ్ ఉంది. ఆయన నిలబడ్డ ప్లేస్‌లో ఓడగొడతా. ఆయన ఎక్కడ నామినేషన్ వేస్తే.. అదే ప్లేస్‌లో ఓడిస్తా’ అంటూ మంగమ్మ శపథం చేసింది శ్రీరెడ్డి.

గతంలోనూ శ్రీరెడ్డి పలువురు స్టార్ హీరోలను ఉద్దేశించి ఫేస్ బుక్ వేదికగా పరోక్షంగా ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో ప్రముఖులుగా వెలుగొందుతున్న వారిని టార్గెట్ చేస్తూ వారి అందరి భాగోతాలు తన వద్ద ఉన్న పెన్ డ్రైవ్‌లో భద్రంగా ఉన్నాయని, సమయం వచ్చినపుడు వాటిని బయటపెడతాను అంటూ ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే.

సంచలనం రేపుతున్న శ్రీరెడ్డి తాజా పోస్ట్ ఇదే

CLICK HERE!! For the aha Latest Updates