శ్రీహరి కొడుకు ‘సినిమా’ ఫస్ట్‌లుక్‌

విలక్షణ నటుడు శ్రీహరికి ఇండస్ట్రీలో ఎంతటి మంచిపేరు ఉన్నదో చెప్పనవసరం లేదు. ఎటువంటి పాత్ర అయిన శ్రీహరి తన నటనతో ఆకట్టుకున్నాడు. చివర్లో ఆయన సినిమా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అనారోగ్యం కారణంగా శ్రీహరి మరణించిన తరువాత ఆ కుటుంబం నుండి ఎలాంటి వార్త రాలేదు. తాజాగా శ్రీహరి పెద్ద కొడుకు మేఘంష్ శ్రీహరి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.

రాజ్ దూత్ అనే యూత్ ఎంటర్టైనర్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు. ఎంట్రీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. అర్జున్.. కార్తీక్ అనే ఇద్దరు దర్శకులు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాజ్ దూత్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. అయితే, సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది… ఎవరెవరు నటిస్తున్నారు అనే విషయాలు త్వరలోనే వెల్లడించనున్నారు.