తండ్రీకొడుకులు కలిసి నటించబోతున్నారు!

గతంలో అక్కినేని నాగేశ్వరావు, నాగార్జున అలానే సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు కలిసి వెండితెరను పంచుకున్నారు. రీసెంట్ గా చిరంజీవి, రామ్ చరణ్ లు కలిసి ఒకే స్క్రీన్ పై కనిపించి ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేశారు. అయితే ఇప్పుడు తెరపైకి మరో తండ్రీకొడుకుల కాంబినేషన్ రాబోతుంది. నిర్మలా కాన్వెంట్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయిన శ్రీకాంత్ తనయుడు రోషన్ తన తదుపరి సినిమా తన తండ్రితో కలిసి నటించాలనుకుంటున్నాడు.

శ్రీకాంత్ ఒకవైపు తనకు తగ్గ కథలు వస్తే హీరోగా చేస్తూనే మరోపక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటిస్తున్నాడు. ఈ మధ్య శ్రీకాంత్ కు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపే లభిస్తోంది. కాబట్టి కొడుకు సినిమాలో నటించడానికి ఎలాంటి అభ్యంతరం చెప్పడు. మరి వీరిద్దరు కలిసి తెరపై కనిపిస్తే ఆశించినంత క్రేజ్ వస్తుందో.. లేదో.. చూడాలి!