సన్నీలియోన్‌తో సునీల్‌

బాలీవుడ్ హాట్‌ భామ సన్నీలియోన్ తాజాగా రాజశేఖర్ నటించిన ‘గరుడవేగ’ సినిమాలో ఐటమ్ సాంగ్‌లో మెరిసిన సంగతి తెలిసిందే. ‘డియో డియో డిసక డిసక’ సాంగ్ 72 మిలియన్ వ్యూస్‌ని కొల్లగొట్టిందంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.

కాగా ఈ సుందరితో కలిసి కామెడీ పండించబోతున్నారట కమెడియన్ సునీల్. కెరియర్ స్టార్టింగ్‌లో కమెడియన్‌గా సత్తా చాటిన సునీల్.. హీరోగా మారి డీలా పడ్డారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ‘అరవింద సమేత’, ‘చిత్రలహరి’ చిత్రాల్లో మెప్పించి వరుస అవకాశాలను అందుకుంటున్నారు.

అయితే సన్నీ లియోన్‌ బాలీవుడ్ మూవీలో సునీల్‌ ఆఫర్ అందుకున్నట్టు తెలుస్తోంది. తాతినేని ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ‘కోకాకోలా’ అనే హిందీ హారర్ కామెడీ చిత్రంలో సునీల్ నటించబోతున్నాడట. మహేంద్ర దరివాల్, పరమదీప్‌ సాందు నిర్మాతలుగా ప్రసాద్‌ తాటికేని దర్శకత్వంలో వస్తోన్న హారర్ కామెడీ చిత్రంలో సునీల్‌తో పాటు బ్రహ్మానందం కూడా నటించబోతున్నారట. ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సిఉంది.