‘దేవుడి తర్వాత అమ్మే.. లవ్‌ యు మా’: సమంత

మాతృ దినోత్సవం సందర్భంగా స్టార్‌ హీరోయిన్‌ సమంత తన తల్లి నినెట్‌ ప్రభుకు శుభాకాంక్షలు చెప్పారు. ఆమె ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. తన తల్లి మనస్తత్వాన్ని పొగిడారు. ‘మా అమ్మ ప్రార్థనల్లో మ్యాజిక్‌ ఉంటుందని నా గట్టి నమ్మకం. చిన్నతనంలో మా అమ్మ దగ్గరికి వెళ్లి.. ‘అమ్మ నా కోసం ప్రార్థించు’ అని అడిగేదాన్ని. ఇప్పటికీ నేను ఆమె దగ్గరికి అలానే వెళ్తుంటా. ఆమె కోరుకుంటే అన్నీ జరుగుతాయని నా నమ్మకం. మా అమ్మలోని మరో ది బెస్ట్‌ ఏంటంటే.. ఆమె ఏ రోజూ తన కోసం తను ప్రార్థించలేదు. దేవుడి తర్వాత అమ్మే.. లవ్‌ యు మా’ అని సామ్‌ పోస్ట్‌ చేశారు.

మరో స్టార్‌ హీరోయిన్‌ అనుష్క కూడా తన తల్లి ప్రఫుల్లా శెట్టికి శుభాకాంక్షలు చెప్పారు. ఆమెతో కలిసి దిగిన సెల్ఫీని పోస్ట్‌ చేశారు. ‘అమ్మను వర్ణిస్తూ ఎన్ని చెప్పినా తక్కువే అవుతుంది. మా సంతోషం కోసం ఆమె చాలా కష్టపడ్డారు. అమ్మలందరికీ మదర్స్‌ డే శుభాకాంక్షలు. ధన్యవాదాలు’ అని స్వీటీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.

CLICK HERE!! For the aha Latest Updates