పెళ్లి కబురుతో.. యంగ్‌ హీరో

యంగ్‌ హీరో రాజ్ తరుణ్ అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటానంటున్నాడు. అయితే పెళ్లి చేసుకోవాలనేది కేవలం ఓ ఆలోచన మాత్రమేనని, అమ్మాయిని ఇంకా ఫిక్స్ చేయలేదంటున్నాడు. చాలా కాలం తర్వాత నెటిజన్స్ తో టచ్ లోకి వచ్చాడు రాజ్ తరుణ్. తన పెళ్లి కబురుతో పాటు ఎన్నో విషయాలపై మనసులో మాట బయటపెట్టాడు. మరీ ముఖ్యంగా హెబ్బాతో తనకు ఎలాంటి రిలేషన్ షిప్ లేదని, తను గ్రేట్ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చాడు. పనిలోపనిగా తను వర్జిన్ ను కాదనే విషయాన్ని కూడా బయటపెట్టాడు ఈ హీరో. ఇక సినిమాల గురించి చెబుతూ, తన కెరీర్ లో రంగులరాట్నం సినిమాను చెత్త మూవీగా చెప్పుకొచ్చాడు.

ఉయ్యాలజంపాల సినిమా ఇష్టమని ఎందుకంటే ఆ సినిమాకు తను రైటర్ గా కూడా వర్క్ చేశానన్నాడు. ఈ రెండు సినిమాల్లో 2 పాటలు కూడా రాసిన విషయాన్ని బయటపెట్టాడు రాజ్ తరుణ్. మంచి స్టోరీ దొరికితే విలన్ గా నటించాలని ఉందనే కోరికను బయటపెట్టాడు రాజ్ తరుణ్. ప్రస్తుతానికైతే తనకు దర్శకత్వంపై దృష్టిలేదని, భవిష్యత్తులో మాత్రం తప్పకుండా తన డైరక్షన్ లో ఓ సినిమా వస్తుందని ప్రకటించాడు. ఈ ఏడాది రాజ్ తరుణ్ నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. రంగులరాట్నం, రాజుగాడు, లవర్ సినిమాల్లో ఏ ఒక్కటి ఆడలేదు. ఈ హీరో మార్కెట్ బాగా పడిపోయింది. దీంతో రాజ్ తరుణ్ సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. ప్రస్తుతం 2 ప్రాజెక్టులు చేతిలో ఉన్నప్పటికీ, వాటిని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

CLICK HERE!! For the aha Latest Updates