పోలవరం TDP దోపిడీదారుల పాలిట కల్పవృక్షం

“పోలవరం తెలుగుదేశం పార్టీ నేతలకు ఏటీఎం లామారింది”. ఈ మాట అన్నది ఎవరో కాదు సాక్షాత్తూ దేశప్రధాని నరేంద్ర మోదీ. మొన్నటి సార్వత్రిక ఎన్నికల ప్రచారారంలో భాగంగా  రాజమహేంద్రవరంలో  జరిగినప్రచార సభలో పాల్గొన్న మోదీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన బిల్లులో పేర్కొన్నట్లుగా పోలవరంను జాతీయప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించింది.  ఈ ప్రాజెక్టు నిర్మా ణ ఖర్చుమొత్తాన్ని కేంద్రమే భరించాలి. అందుకు కేంద్రం సిద్ధపడింది కూడా. పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి అధికార దాహంతో ఎంత అందితే అంత నొక్కేద్దాం అనే సూత్రానికి తెరలేపింది టీడీపీ ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్టును ప్రధానినరేంద్ర మోదీ చెప్పినట్లు టిడిపి నేతలు ఏటీఎం గానేమర్చారు. దేశంలో ఇప్పటివరకూ 23 జాతీయ ప్రాజెక్టులనునిర్మించారు. ఇందులో కొన్నింటిని ఇంకా నిర్మిస్తున్నారు. ఏరాష్ట్ర ప్రభుత్వం కూడా జాతీయ ప్రాజెక్టుకు డబ్బుమీరివ్వండి… నిర్మాణ బాధ్యతను మేం చేపడతాం అనిచెప్పలేదు. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని అప్పటి నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వం కేంద్రంలో రాజకీయ పొత్తుపెట్టుకొనినిర్మాణ బాధ్యతను సాధించుకుంది. టిడిపి ప్రభుత్వవ్యవహారం ఎప్పూడూ పైన పటారం లోన లోటారంచందంగానే ఉంది. ఎల్లోమీడియాను అడ్డంపెట్టుకొనిచారాణ పనిచేసి బారాణ దోపిడికి తెరలేపింది చంద్రబాబుప్రభుత్వం. చూసిన వాళ్లందరూ మన సీఎం ఎంతో కష్టపడినిర్మాణ బాధ్యతలను చేపట్టారు అని అనుకున్నారు. ఆ పట్టువెనుక  ఉన్న మర్మం ఏమిటో ఆ తరువాత జరిగినపరిణామాలు, ప్రధాని మన రాష్ట్ర పర్యటనలో చేసినవ్యాక్యలతో తేటత్లెం అయ్యింది.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ కాంట్రాక్టును కాంగ్రెస్‌ ప్రభుత్వంఅధికారంలో ఉన్నపుడు అప్పటి కాంగ్రెస్‌ నేత, ఆ తరువాతటీడీపీలో చేరి ఎంపీగా ఎన్నికైన రాయపాటిసాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌స్ట్రాయ్‌ కంపెనీదక్కించుకుంది. రాష్ట్ర అవసరాల దృష్ట్యా ఏంతోప్రాధాన్యంగల పోలవరం నిర్మాణం యుద్ధప్రాతిపాదికనచేయాల్సిందిపోయి, ఆర్ధిక వనరు లేమితో అల్లాడుతున్న ఆకంపెనీ నత్తకు నడక నేర్పించే విధంగా పనులను మెల్లిగా చేస్తూ వస్తోంది. రాష్ట్ర విభజన తరువాత జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈప్రాజెక్టు నిర్మాణాన్ని తమకు అప్పగిస్తే రాకెట్‌ వేగంతో పూర్తిచేస్తామని తెగ హామీనిచ్చింది. సీఎం చంద్రబాబు 30సార్లుప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించారు. 90 సార్లుసచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారాసమీక్షించారు. సోమవారాన్ని పోలవారంగా మార్చి ఎల్లోమీడియా ద్వారా ఏక్కడలేని ప్రచారాన్ని కల్పించుకున్నారు.2018లోనే తొలి పంటకు నీరిస్తామని, రాసుకోండి అనిసాక్ష్యాత్తూ శాసన సభ సాక్షిగా అప్పటి మంత్రి దేవినేని ఉమ తొడకొట్టి మరీ శపథం చేశారు. అయితే ఈ ప్రాజెక్టు పనులుమూడు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెనక్కూ అన్నట్లుగా సాగుతోంది. టిడిపి ప్రభుత్వం ఐదేళ్లలో తానుఇచ్చిన ఏ ఒక్క హామీనీ కూడా నెరవేర్చకపోవడం, తరువాతఎన్నికల్లో ప్రజలు టిడిపి ప్రభుత్వానికి బుద్ధి చెప్పిన సంగతితెలిసిందే.. ఇటీవల ఎన్నికల్లో అఖండ విజయం సాధించి,వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పడినవైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలనేఉద్ధేశ్యంతో రివర్స్‌ టెండరింగ్‌కు వెళుతోంది. ఈ పద్ధతిలోపారదర్శకంగా ఎవరు అతి తక్కువ ధరకు ప్రాజెక్టునిర్మిస్తామని ముందుకు వస్తే వారికే పనులను అప్పగిస్తామని సిఎం జగన్ ప్రకటించారు. రివర్స్‌ టెండరింగ్‌తో ప్రభుత్వంపైభారం కూడా తగ్గుతుంది. ఒకవేళ ఈ విధానంవిజయవంతమైతే తాము చేసిన తప్పులు, ముఖ్యంగాపోలవరం పేరుతో చేసిన దోపిడీ ఎక్కడ బైటకు వస్తుందోనన్నభయంతో ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతుందని చెప్తూటీడీపీ నేతలు ఈ విధానాన్ని  వ్యతిరేకిస్తూ నానా యాగీచేస్తున్నారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ కాంట్రాక్టును దక్కించుకున్నటీడీపీ నేత రాయపాటి సాంబశివరావుకు చెందినట్రాన్స్‌స్ట్రాయ్‌ కంపెనీ ఆర్ధికంగా దివాళా తీయటంతో తనఅనుయాయులు, బినామీలను చంద్రబాబు పోలవరంప్రాజెక్టు పనుల్లోకి జొప్పించారు.ఈ ప్రాజెక్టు పనులనుచంద్రబాబు ప్రధాన  బినామీగా పేరుపడ్డ టీడీపీ రాజ్యసభసభ్యుడు సీఎం రమేష్‌కు సన్నిహిత కంపెనీగా పేరున్న త్రివేణీసంస్థకు సబ్‌ కాంట్రాక్ట్‌ ద్వారా కట్టబెట్టారు. ఈ కంపెనీచంద్రబాబు బినామీ అని రాజకీయ, ఇన్‌ఫ్రా కంపెనీ వర్గాల్లోప్రచారంలో ఉంది. పోలవరం కుడి, ఎడమ కాలువపనులను కూడా ప్యాకేజీలుగా విభజించి చంద్రబాబు తనఅనుయాయులకు, పార్టీ నేతలకు కట్టబెట్టారు. అప్పటిటీడీపీ ప్రభుత్వంలో రెండో స్థానంలో ఉన్నఆర్ధిక మంత్రియనమల రామకృష్ణుడు తన వియ్యంకుడు పుట్టా సుధాకర్‌ యాదవ్‌కు వందల కోట్ల విలువైన పనులను కట్టబెట్టారు.ఒకపక్క ప్రభుత్వ ఆర్దిక పరిస్థితి బాగోలేదని చెప్పే ఆర్ధికమంత్రి యనమల తన వియ్యంకుడి కంపెనీ బ్లిల్లులు వస్తేమాత్రం ఆఘమేఘూలపై క్లియర్‌ చేసేవారు. రాజుతలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు టీడీపీ నేతబిల్లులను పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి చాలా వేగంగాచెల్లించటంలో యనమల ఆర్ధికమంత్రిగా ప్రత్యేక శ్రద్ధకనబరిచారు.
అప్పటి ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు తనవియ్యంకుడు పుట్టా సుధాకర్‌ యాదవ్‌కు టీడీపీ ప్రభుత్వంపోలవరం  ఎడమ కాలువ అయిదో ప్యాకేజ్‌లో రూ. 142 కోట్లవిలువైన పనులను కట్టబెట్టింది. ఇదే కాలువ ఆరోప్యాకేజీపనులను టీడీపీ తూర్పు గోదావరి జిల్లా నేత ఋసుసుధాకరరావుకు అప్పగించారు. దీని విలువ 179 కోట్లు. ఇకచంద్రబాబు బినామీగా పేరు గాంచిన ప్రస్తుత ఎంపీ సీఎంరమేష్‌ ప్రవేశపెట్టిన త్రివేణీ సంస్థకు అత్యధికంగా రూ. 1708 కోట్ల విలువైన హెడ్‌ వర్క్స్‌ మట్టి పనిని అప్పనంగాకట్టబెట్టారు. పోవరం కుడి కాువ ఆరు, ఏడు ప్యాకేజీపనులను టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్యకుచెందిన బీఎస్‌పీసీఎల్‌ కంపెనీకి అప్పగించారు. ఈ  పనులవిలువ 286 కోట్లు పైమాటే. సూర్య కన్‌స్ట్రక్షన్స్‌ శ్రీనివాసరావుకు రూ. 103 కోట్ల పలను అప్పగించారు. అధికారికంగా కాగితాలపై ఉన్న కంపెనీలు ఇవైతేఅనధికారికంగా ఇంకా ఎన్ని ఉన్నాయో చెప్పలేని పరిస్థితి.
వైఎస్ జగన్ ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ఇప్పటివరకూ 2300 కోట్లు రూపాయాలకు పైగా అధికంగాబిల్లుల రూపంలో చంద్రబాబు బినామిలకు చెల్లించినట్లుతేల్చిచెప్పింది. మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ చెల్లింపులుఇస్టానుసారంగా చేస్తున్నారని, మట్టి పనిని ఎం బుక్‌లో రికార్డ్‌ చేయలేదని కమిటీ తన నివేదికలో పేర్కొంది. సీఎం రమేష్‌ తెచ్చిన త్రివేణీ కంపెనీకి మట్టి పనులు అప్పగించటంలోచంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ  కనబరిచారు. ఈ శ్రద్ధ వెనుక ఆర్ధికప్రయోజనాలున్నాయన్నది బహిరంగ రహస్యం. ఏపనినిబినామిలకు అప్పజెప్పితే ఎక్కువ దోపిడికి అవకాశముందోచూసుకున్నారు, మట్టిపనులను ఎంచుకున్నారు. మట్టిపనుల్లో ఖర్చు తక్కువ  నొక్కేయడం ఎక్కువ. అందుకే సీఎంరమేష్‌ కూడా ఈ పనినే ఎంచుకున్నారు. పోలవరం ప్రాజెక్టునిర్మాణ పనుల్లో  అవినీతి ఎలా జరిగిందో ప్రభుత్వంనియమించిన నిపుణుల కమిటీ తేల్చింది.  ఎస్‌ఈ స్థాయిఅధికారిని కాంట్రాక్టు సంస్థ నిర్వహించే మెస్‌కు ఇన్‌ఛార్జిబాధ్యతలను అప్పగించారంటే పరిస్థితి ఏంటో అర్థంచేసుకోవచ్చు.
పోలరవం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన  మెటీరియల్‌ నాణ్యతను పరీక్షించేందుకు కూడా ప్రభుత్వం చెల్లింపుచేసింది. అయితే నిబంధన ప్రకారం అక్కడ నాణ్యత పరీక్షకులేబరేటరీ ఏర్పాటు చేయాల్సి ఉన్న టిడిపి నేతల కక్కుర్తికనీసం లేబరేటరీని కూడా ఏర్పాటు చేయనీయలేదు.లేబరేటరీ ఉన్నట్లు సంస్థ మాత్రం తెలిపింది.  సిమెంట్‌, ఇతర మెటీరియల్‌ కాంట్రాక్టు సంస్థ కొనుగోలు చేసి బిల్లులనుశాఖా పరంగా చెల్లించారు. ఈ చెల్లింపు కాంట్రాక్టర్‌ నుంచితరువాత రాబట్టినా ఇది ప్రభుత్వ విధానం, ఒప్పందనిబంధనకు పూర్తిగా వ్యతిరేకం.  శాఖా పరమైన చెల్లింపుద్వారా  కాంట్రాక్టు ఏజెన్సీ మెటీరియల్‌ కొనుగోలు చేసినా .. 7 ఏఫ్‌  అకౌంట్‌ నిర్వహణ ద్వారా కొనుగోలు చేసినామెటీరియల్‌ నిర్మాణ ప్రాంతానికి చేరుతుందా లేదా అనే పర్యవేక్షణ అవసరం . అయతే చెల్లించిన అడ్వాన్సుకుసరిపడినంత మెటీరియల్‌ వచ్చిందా లేదా అనే పర్యవేక్షణకూడా అస్సలు జరగలేదు.  డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌  అక్కడలేదు.  నిబంధన ప్రకారం డివిజినల్‌ ఎకౌంట్స్‌ అధికారి అన్నిఅకౌంట్లను తనిఖీ చేయాలి. ఇది జరగలేదు.  ఇంప్రెస్ట్‌ అకౌంట్‌ కింద చేసిన ఖర్చు ఆడిట్‌ జరగలేదు. సమగ్రఅకౌంట్స్‌ వివరాలు అందుబాటులో లేవు. ఓచర్లపైమెటీరియల్‌ పూర్తి వివరాలు, ఒక్కో మెటీరియల్‌  ధర లేవు. ఏకమొత్తంగా చెల్లింపులు జరిగాయి.  అకౌంట్స్‌ కోడ్‌ అమలౌందా లేదా అని డీఏఓ పర్యవేక్షించాలి. అలాంటివ్యవస్థ  ఎస్‌ఈ వద్ద అందుబాటులో లేదు  కోడ్‌ రూల్‌నుఇక్కడ ఉల్లంఘించారు.వారానికి ఒకసారి రేషన్‌ కింద 2017 సెప్టెంబర్‌ 25తో పాటు పులుమార్లు చెల్లింపులు జరిపారు. ఎస్‌ఈని కాంట్రాక్టర్‌ ఏర్పాటు చేసిన కిచెన్‌ ఇన్‌ఛార్జిగాచూపారు. ఇదో వింత. ఆ రోజున 44,23,981 అడ్వాన్స్‌గాచెల్లించారు. ఎంత దారుణంగా అందినకాడికి దోచుకున్నారోఅనేదానికి ఇదో ఉదాహరణ. వీక్లీ రేషన్‌కు భారీమొత్తంలో అడ్వాన్స్‌లు చెల్లించారు. మెటీరియల్‌కు అడ్వాన్స్‌ చెల్లించారు.కాంట్రాక్టర్‌ నుంచి రికవరీ చేసిన మొత్తాన్నిఇంప్రెస్ట్‌ హ్డోల్డర్‌ ఎకౌంట్‌లో జమ చేశారు. ప్రభుత్వ ఎకౌంట్‌లోజమ కాలేదు. డీజిల్‌ కొనుగోలు చేసేందుకు కొత్త కాంట్రాక్టర్‌కురివాల్వింగ్‌ ఫండ్‌ కింద ప్రత్యేకంగా చెల్లించారు.  పాతకాంట్రాక్టర్‌కు ఎన్‌ఎంఆర్‌ చెల్లింపు కింద రూ. 12.28లక్షలుజమ చేశారు. ఇంప్రెస్ట్‌, రివాల్వింగ్‌ ఫండ్‌ కింద చేసినచెల్లింపు ఎం బుక్‌లో నమోదు చేయలేదు. ఇది నిబంధనకువిరుద్ధం.  ఇంప్రెస్ట్‌, రివాల్వింగ్‌ ఫండ్‌ కింద అందుకున్నమెటీరియల్‌కు సంబంధించిన శాఖా అకౌంట్లలో ఎలాంటివివరాలు లేవు.  ప్రధాన కాంట్రాక్టర్‌ ట్రాన్స్‌స్ట్రాయ్‌ నుంచిఇంప్రెస్ట్‌ అకౌంట్‌ ద్వారా రూ. 144.22 కోట్లు బకాయి ఉన్నారు.ఆ మొత్తాన్ని రికవరీ చేసేందుకు ఎలాంటి చర్యలుతీసుకోలేదు. ఈ మొత్తాన్ని రికవరీ చేసేందుకు న్యాయపరంగాజలవనరుల శాఖ చర్యలు తీసుకోవాలి. ఆర్‌ ఆర్‌ చట్టంద్వారా రికవరీ చేసేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. అధికారాన్ని  అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు చేసినపోలవరం దందాలో  నిబంధనలను పాతరేసి దోపిడికి పాల్పడ్డ తీరుకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. అసలు పోలవరంలో జరిగిన అవినీతిపై నిపుణుల కమిటి ఏమన్నదో కొన్ని వివరాలను చూద్దాం.
పోవరం ప్రాజక్టుపై నిపుణుల కమిటీ చేసిన కొన్ని ముఖ్య సిఫారసులు 
  • పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ఒప్పందాన్నిపున:సమీక్షించటం వ్ల 2015`16 ఎస్‌ ఎస్‌  ఆర్‌ రేట్లప్రకారం 1331 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపైపడింది.
• వాస్తవ ప్రధాన కాంట్రాక్టర్‌ నుంచి మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌పై వడ్డీ 84.43 కోట్లు తిరిగి రాబట్టాలి.
• ఇంప్రెస్ట్‌ కింద ప్రధాన కాంట్రాక్టర్‌కు చెల్లించిన 141.22 కోట్ల మొత్తాన్ని ప్రధాన కాంట్రాక్టర్‌ నుంచి రికవరీచేయాలి.
• స్థలం స్వాధీనం చేయకముందే హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టునిర్మాణానికి చెల్లించిన అడ్వాన్సు 787.20 కోట్లు  తిరిగిరాబట్టాలి.
• 5.ఈవిధంగా చూస్తే మొత్తం అదనపు చెల్లింపులు2346.85 కోట్లు.
• ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పోలవరం ప్రాజెక్టునుసత్వరమే పూర్తి చేయాలి. ప్రాజెక్టుతో పాటు పవర్‌హౌస్‌ నిర్మాణ పను కొనసాగింపు తప్పనిసరి. నిర్మాణపనులను ప్రస్తుతం చేస్తున్న సంస్థతోనే కొనసాగించాలా, కొత్త సంస్థతో చేయించాలా అనే అంశాన్ని ప్రభుత్వంన్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకునినిర్ణయించాలి. నిర్వహణలోపాలు, నిర్మాణంలో జాప్యంవంటి వాటిని పరిష్కరించేందుకు సంబంధిత ప్రాజెక్టుఅధికారి దృష్టి సారించాలి.
• ప్రాజెక్టు నిర్మాణ కాంట్రాక్టు దక్కించుకున్న  వాస్తవ సంస్థట్రాన్స్‌స్ట్రాయ్‌ ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయి ఎన్‌సీఎల్‌టీ కేసుల్లో ఇరుక్కున్నందున దానినికొనసాగించాలా లేదా తొగించాలా అనే అంశంపైసత్వరమే నిర్ణయం తీసుకోవాలి.
• 8.పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి వివిధ సందర్భాల్లో తొలుత కాంట్రాక్టు పొందినట్రాన్స్‌స్ట్రాయ్‌ సంయుక్త భాగస్వామ్య సంస్థల వైఫల్యంచెందటంతో ఏపీఎస్‌ఎస్‌లోని పీఎస్‌ 60సీ నిబంధనకింద  ఆ సంస్థను తొలగించి పనులను మెస్సర్స్‌ నవయుగ  ఇంజనీరింగ్‌ సంస్థకు అప్పగించారు.
• 9.పోలవరం హెడ్‌వర్క్స్‌, విద్యుత్‌ కేంద్రానికిసంబంధించిన పత్రాలను కమిటీ సభ్యులు పరిశీలించికింది అభిప్రాయానికి వచ్చారు.
• 10.ప్రధాన డ్యాం పనులను ఈపీసీ నిబంధనకుఅనుగుణంగా ధర పెంపునకు అవకాశం ఉండగాఅందుకు విరుద్ధంగా ప్రధాన  కాంట్రాక్టర్‌ ట్రాన్స్‌స్ట్రాయ్‌ జేవీ సంస్థకు 2015`16 ఎస్‌ఎస్‌ఆర్‌ రేట్లను చెల్లించారు. ఈ రేట్లతో  ఒప్పందాన్ని రివైజ్‌ చేయటంతో పాటు ఒప్పంద విలువను రూ. 4054 నుంచి ఎకంగా 5385.91కు పెంచారు.
• 11.ఆ ఒప్పందం ప్రకారం స్టీల్‌, సిమెంట్‌, ఇంధనంకుమాత్రమే ధరను సవరించే అవకాశం ఉంది. నిబంధలను అతిక్రమించటం వల్ల ఒప్పంద విలువరూ. 1331 కోట్లకు పెరిగింది.  ఇది  నిబంధనలకుపూర్తిగా విరుద్ధం. మిగిలిన సివిల్‌ పనులను 2018`19 సంవత్సరంలో ట్రాన్స్‌స్ట్రాయ్‌ జేవీ నుంచి తొలగించినవయుగ ఇంజనీరింగ్‌ కంపెనీకి అప్పగించారు. ఈపనుల విలువ రూ. 3302 కోట్లు.
• 12.ఈపీసీ కాంట్రాక్టర్‌కు అడ్వాన్స్‌ రూపంలో ప్రత్యేకంగాచెల్లించిన రూ. 144.22 కోట్లను తిరిగి వసూలు చేయలేదు. ఈ మొత్తాన్ని రాబట్టేందుకు తగిన చర్యుతీసుకోవాలి.
• 13. మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ కింది చెల్లించిన మొత్తానికిరూ. 84.43 కోట్ల  బకాయిల వడ్డీని వసూలుచేయలేదు. అడ్వాన్స్‌, మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌పై వడ్డీమొత్తం కలుపుకుని  అదనపు చెల్లింపులు రూ. 228.65 కోట్లు  ప్రధాన కాంట్రాక్టర్‌ నుంచి రికవరీచేయాలి.