వరల్డ్‌కప్‌ పోరులో ఘనంగా ఆరంభించిన కోహ్లి సేన


సౌతాంప్టన్లో జరిగిన ఐసీసీ ప్రపంచకప్‌ పోటీల్లో భారత్ బోణీ కొట్టింది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 228 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 47.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. రోహిత్ శర్మ వన్డేల్లో 23వ సెంచరీ చేశాడు. 144 బంతుల్లో 13 ఫోర్లు, రెండు సిక్సర్లతో 122 పరుగులు చేశాడు. మిగతా ఆటగాళ్లలో ధావన్ 8, కెప్టెన్ విరాట్ కోహ్లీ 18, లోకేశ్ రాహుల్ 26, ధోనీ 34, పాండ్యా 15 పరుగులు చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది.